దేవీపట్నం వరద బాధితులకు అండగా " విన్సెంట్ డి పాల్ సొసైటీ"

తూర్పుగోదావరి ఏరియా కౌన్సిల్ పరిధిలో గల గొల్లప్రోలు కాన్ఫరెన్స్ కు చెందిన దేవీపట్నం ఇటీవల గోదావరి వరదల ముంపునకు గురియైనది.
 

తెలుగు రాష్ట్రాల చాల చోట్ల   ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి.అంచనాలకు మించిన వర్షపాతం నమోదవుతోంది. .నీట మునిగిన తీరప్రాంత గ్రామాలు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాల్లో పరవళ్లు తొక్కుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.తూర్పుగోదావరి ఏరియా కౌన్సిల్ పరిధిలో గల గొల్లప్రోలు కాన్ఫరెన్స్ కు చెందిన దేవీపట్నం ఇటీవల గోదావరి వరదల ముంపునకు గురియైనది.

" విన్సెంట్ డి పాల్ "   ఏరియా కౌన్సిల్ అధ్యక్షులు  "బ్ర.డేవిడ్ రాజు " గారు మరియు విశాఖపట్నం  సెంట్రల్  కౌన్సిల్  అధ్యక్షులు " శ్రీ రామరావు " గారు  నేషనల్ కౌన్సిల్  సహాయంతో  అవసరంలో ఉన్నవారికి  వంట పాత్రలు, మగవాళ్ళకు ఒక పంచి, తువ్వాలు కొనడం జరిగినది . డేవిడ్ రాజు గారి అధ్యక్షతన అన్ని కాన్ఫరెన్సుల అధ్యక్షులు కలసి ఈ నెల 3వ తేదీ(03.09.2109)న ఎన్నో వ్యయప్రయాసలకు గురియై దేవీపట్నంలో పంపిణీ చేసారు.ఈ సందర్భంగా  విశాఖపట్నం  సెంట్రల్  కౌన్సిల్  అధ్యక్షులు " శ్రీ రామరావు " గారు మాట్లాడుతూ  ప్రభువు నామములో   చేసినటువంటి ఈ సహాయము ఎంతో సంతృప్తినిచ్చిందని ,ఆ  దేవాదిదేవునికి వేలాది  వందనములు తెలుపుతూ ,  జాతీయ అధ్యక్షులు బ్ర. జాన్సన్ వర్గీసుగార్కి, ఏరియా కౌన్సిలు అధ్యక్షులు డేవిడ్ రాజు గార్కి మరియు అన్ని కాన్ఫరెన్సు అధ్యక్షులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు . సహాయము చేసిన ప్రతి ఒక్కరిని మరియు  వారి  కుటుంబమును దేవుడు సర్వదా దీవించాలని ప్రార్ధించారు .

Add new comment

6 + 1 =