దివ్య సత్ప్రసాద మహా ప్రదక్షణ | క్రీస్తు రాజు గిరిజన విచారణ ఎర్ర సామంత వలస

విశాఖ అతిమేత్రాసనం  క్రీస్తు రాజు గిరిజన విచారణ ఎర్ర సామంత వలస లో క్రీస్తు రాజు పండుగ సందర్భముగా దివ్య సత్ప్రసాద మహా ప్రదక్షణ జరిగింది . 
విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు , ఎర్ర సామంత వలస విచారణ కర్తలు గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారి ఆద్వర్యం లో ఈ దివ్య సత్ప్రసాద మహా ప్రదక్షణ  ఘనంగా జరిగింది. 

గ్రామా వీధులలో ప్రభు యేసుని కొనియాడుతూ, కీర్తిస్తూ దివ్య సత్ప్రసాద మహా ప్రదక్షణ కన్నులపండుగగా జరిగింది.  దివ్య సత్ప్రసాద ప్రభువునకు ఆహ్వానం పలుకుతూ మార్గం అంతటా గ్రామా ప్రజలు చీరలు, దుప్పట్లు పరిచారు. వీధులను విద్యుత్ దీపాలతో అలంకరించారు.   తమ తమ గృహాల మీదుగా వెళ్తున్న ఆ దివ్య సత్ప్రసాద నాధునిని  కొనియాడుతూ గ్రామ ప్రజలు ప్రదక్షణలో పాల్గొన్నారు.    

గ్రామానికి చెందిన ఒక విశ్వాసి  మాట్లాడుతూ ప్రభువు రాకతో మా గ్రామం పులకించినది అని తెలిపారు. విచారణ కర్తలు గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారు  మాట్లాడుతూ  ప్రజలు ఎంతో భక్తశ్రద్ధలతో ప్రభువుని  ఆరాధించారు అని , ఆ ప్రభువుకే మహిమ ఘనత కీర్తి కలుగును గాక అని అన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

Add new comment

8 + 11 =