దివ్య బాలయేసు మహోత్సవ "త్రిదిన ప్రార్ధనలు" లో అద్భుతం

దివ్య బాలయేసు మహోత్సవ "త్రిదిన ప్రార్ధనలు" లో అద్భుతం

విశాఖ అతిమేత్రాసనం బొబ్బిలి విచారణ లోగల బాలయేసునగర్ (గొల్లవీధి) లో అద్భుత శక్తిగల దివ్య బాలయేసు మహోత్సవం "త్రిదిన ప్రార్ధనలు" ఘనంగా జరుగుతున్నవిషయం మనకు తెలిసినదే. మూడవరోజు  త్రిదిన ప్రార్ధనలులో  గురుశ్రీ జయరాజు  గారు పాల్గొని ప్రజల కొరకు ప్రార్దించి, ఆశీర్వాదించారు .

బొబ్బిలి విచారణ కర్తలు  గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ "త్రిదిన ప్రార్ధనలు" భక్తియుతంగా సాగుతుండగా, మూడవరోజు అనగా 01 ఫిబ్రవరి 2023న ఒక అద్భుతం జరిగింది.    

పిల్లలు లేని దంపతుల కొరకు గురుశ్రీ మోహన్ ప్రసాద్ గారు ప్రతేకంగా ప్రార్థనలు జరిపారు. దివ్య బాలయేసుని సమక్షంలో చిన్నపిల్లల ఉయ్యాలను ఏర్పాటు చేసి అందులో బాల యేసుని ఉంచి పిల్లలు లేని దంపతులతో ఆ ఉయ్యాల చెంత ప్రార్ధించి ,ఆ దంపతుల చే బాలయేసు ఉయ్యాలను ఊపించారు. పిల్లలు లేని దంపతులు భారంతో ప్రార్ధించి , బాల యేసుని తమ బిడ్డగా చూసుకుని పరవశులయ్యారు.  

గురుశ్రీ మోహన్ ప్రసాద్ గారు  ప్రార్థిస్తూ ఉండగా, ప్రజలందరూ ప్రార్థనలలో ఏకీభవిస్తుండగా నడక రాని ఒక చిన్నారి ఒక్కసారిగా లేచి  అద్భుత రీతిలో నడవడం ప్రారంభించింది. తల్లి దండ్రులు దీనిని గమనించి సంతోషముతో  విచారణ గురువులకు తెలియజేసారు.

ఆ చిన్నారి  పేరు బ్రౌనిక. తండ్రి పేరు సురుపల్లి కిరణ్ , తల్లి పేరు కరుణ. బ్రౌనిక ఇప్పటివరకు నడవలేదని,  హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతుంది తల్లి దండ్రులు తెలియజేసారు.  దివ్య బాలయేసు పై ప్రేమ, నమ్మకంతో ఈ "త్రిదిన ప్రార్ధనలు"లో పాల్గొన్నాము  అని తెలిపారు. బ్రౌనిక నడవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని,ఆ దేవాది దేవునికే మహిమ అని,  తమను ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న గురుశ్రీ మోహన్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
బొబ్బిలి విచారణ విశ్వాసులు, ప్రజలు  జరిగినటువంటి ఈ  అద్భుతాని చూసి ఆ దేవాది దేవుని స్తుతులతో మహిమపరిచారు.

Add new comment

3 + 1 =