దివ్యసత్ప్రసాదము స్వీకరించిన నిత్యసహాయమాత విచారణ బాలబాలికలు.

నెల్లూరు, త్రిపురంతకం, నిత్యసహాయమాత విచారణ, లేళ్లపల్లి గ్రామములో 10 మంది బాలబాలికలకు పునీత తోమాస్ గారి పండుగ రోజు (3 జులై 2022 )న దివ్యసత్ప్రసాధము స్వీకరించారు.

విచారణ గురువులు గురుశ్రీ బండి సాగర్ సంతోష్ MSFS గారి సారధ్యం మరియు సహాయక నూతన గురువులు గురుశ్రీ  కాట్రూ ప్రదీప్ MSFS గారు దివ్యపూజను సమర్పించి దివ్యసత్ప్రసాధము యొక్క ప్రాముఖ్యతను, మరియు పునీత తోమాస్ గారి జీవిత విశేషాలు గురించి ప్రసంగించారు.

విచారణ గురువులు పిల్లలకు సత్యోపదేశం బోధించిన ఉపదేశులు జేసుదాసు,యాకోబు మరియు  పి. కాంతారావు గార్లను అభినందించారు.

నెల్లూరు మేత్రాసనాన్ని ఆ దేవాదిదేవుడు ఎల్లప్పుడు దీవించాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు.

Add new comment

6 + 11 =