దివ్యసత్ప్రసాదము, భద్రమైన అభ్యంగనము స్వీకరించిన 90 మంది బాలబాలికలు

విజయవాడ మేత్రాసనం,కంకిపాడు విచారణ ఆరోగ్యమాత దేవాలయ బాలబాలికలు మే 29, 2022, విజయవాడ పీఠాధిపతి మహా పూజ్య. తెలగతోటి రాజా రావు తండ్రి గారిచే ప్రధమ దివ్యసత్ప్రసాదము మరియు భద్రమైన అభ్యంగనము స్వీకరించారు.

ఈ విచారణ నుండి 50 మంది నూతనంగా దివ్య సత్ప్రసాదమును మరియు 90 మంది భద్రమైన అభ్యంగనము స్వీకరించారని విచారణ కర్తలు గురుశ్రీ యన్ డేవిడ్ రాజు గారు తెలిపారు.

విచారణ కర్తలు గురుశ్రీ యన్ డేవిడ్ రాజు గారు విచ్చేసిన పీఠాధిపతులవారికి, విచారణ సంఘపెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. 

విచారణ గాయక బృందం పవిత్ర గీతాలను ఆలపించారు. 

విజయవాడ మేత్రాసనాన్ని ఆ మరియ తల్లి ఎల్లప్పుడు దీవించాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు

Add new comment

2 + 12 =