దళిత క్రైస్తవ హక్కులపై సామర్ధ్య పెంపుదల సదస్సు 

సామర్ధ్య పెంపుదల సదస్సుమహా పూజ్య. పొలిమెర జయరావు

TCBC కమిషన్ ఫర్ SCBC ఆధ్వర్యంలో 9 జూన్ 2022 న మహా పూజ్య. పొలిమెర జయరావు గారి అధ్యక్షతన దళిత క్రైస్తవ హక్కులపై సామర్ధ్య పెంపుదల సదస్సు ఏలూరులోని బిషప్ జాన్ కాన్ఫరెన్స్ హాల్ నందు  జరిగింది. దళిత క్రైస్తవుల హక్కులు, శక్తిసామర్ధ్యాలు, నాయకత్వ నైపుణ్యత అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన SCBC కమిషన్ అధ్యక్షులు, ఏలూరు పీఠాధిపతులు మహా పూజ్య. జయరావు గారు మాట్లాడుతూ దళిత క్రైస్తవ సాధికతర విధాన పత్రముపై అందరిలో ముఖ్యంగా ప్రజలలో, గురువులలో, కన్యస్త్రీలలో సాధికార పాత్ర అమలుకై చైతన్యం తీసుకురావాలని ఆయన కోరారు. ప్రతి విచారణ గురువు పీఠ స్థాయిలో,ఎం ప్రాంతీయ స్తాయిలో కులాలకు అతీతంగా ఈ సాధికారిక పత్రాన్ని ఒక దేవుని మాటగా భావించి, దళిత క్రైస్తవ పేద వర్గాల వారికి సహాయ సహకారాలు అందించాలని, నాయకత్వ లక్షణాలను వారిలో పెంపొందించుకునే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జాతీయ SCBC కమిషన్ అధ్యక్షులు మహా పూజ్య. శరత్ నాయక్ గారు జాతీయ స్థాయిలో జరుగుతున్న క్రైస్తవ వివక్షత హక్కుల పోరాటాలు మరియు దళిత క్రైస్తవ హక్కుల విధాన పత్రంలోని అంశాలను క్లుప్తంగా వివరించారు.   

విజయవాడ పీఠం కార్యదర్శి అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ దళిత సాధికారత విధాన పత్రంలోని పలు అంశాలను సదస్సులో పాల్గొన్న నాయకులకు వివరించడం జరిగింది. అడ్వకేట్ అద్దంకి రమేష్ గారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత క్రైస్తవులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు మరియు తాకీదులు వివరిస్తూ దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా వస్తున్న ప్రభుత్వ ఉత్తర్వులకు సమిష్టిగా పోరాడాలని తెలిపారు.

ఇంటర్లెక్చువల్ ఫోరమ్ కార్యదర్శి పిచ్చపోగు రవి గారు మాట్లాడుతూ దళిత క్రైస్తవులు, వివిధ సంఘాల నాయకులు అందరు కలిసి గురువులు మరియు పీఠాధిపతుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశాలలో నాయకులు ఎంతో నైపుణ్యం సంపాదించుకొని దళిత క్రైస్తవులకు జరుగుతున్న వివక్షత పైన సమిష్టిగా శాంతి పోరాటాలు చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమం TCBC కమిషన్ SCBC ప్రాంతీయ కార్యదర్శి డాక్టర్ ఎలీషా కుమార్ కలివెల గారి నాయకత్వంలో విజయంతంగా నిర్వహించబడింది. 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో ఈ కమిషన్ కోసం ప్రతి మేత్రాసనంలో ఈ కమిషన్ యొక్క పేద దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న వివక్షత హక్కుల కొరకై కమిషన్ ఆశయాలను విజయవంతం చేయుటకు అంకితభావం, పట్టుదల కలిగిన మేధావులు, న్యాయవాదులు, సంఘ నాయకులు, మహిళా నాయకులు నిరంతర కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వంద మంది నాయకులు, నాయకురాళ్లు, గురువులు, మేధావులు పాల్గొనడం జరిగింది. 

మహా పూజ్య. పొలిమెర జయరావు

దళిత క్రైస్తవులకు SC హోదా పైన సుప్రీమ్ కోర్టులో ఫిల్ వేయడం జరిగింది. దీనిపై సుప్రీమ్ కోర్టు అడ్వకేట్, MCBC చైర్మన్ ఫ్రాంక్లిన్ సీజర్ థామస్ గారు జూమ్ సమావేశంలో పాల్గొని సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ సుప్రీమ్ కోర్టు లో క్రైస్తవుల SC హోదాకై పలు కేసులు వ్యాజ్యంలో ఉన్నాయని, జస్టిస్ రంగనాధ్ మిశ్రా కమిషన్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు SC హోదా ఇవ్వాలని సుప్రీమ్ కోర్టులో సిఫార్సు చెయ్యడం జరిగిందన్నారు. క్రైస్తవులకు SC హోదా సాధించడానికి అనేక అనుకూల అంశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మీనమేషాలు వేస్తుండడతో దళిత క్రైస్తవులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 1950 వ సంవత్సరం పారా నెంబర్ 3 లో భారత రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులకు విరుద్ధంగా ఉందని, ఆ పారాను ఎత్తివేయాలని దళిత క్రైస్తవులు చేస్తున్న ఉద్యమం తీవ్రతరం చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవులు చేస్తున్న ఉద్యమంలో తెలుగు రాష్ట్రాలలో ఏలూరు పీఠాధిపతులు డాక్టర్ జయరావుగారు అంకితభావంతో చేస్తున్న కృషి, పట్టుదల అభినందనీయమని ఆయన కొనియాడారు. 

విజయవాడ పీఠం కార్యదర్శి అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ దళిత సాధికారత విధాన పత్రంలోని పలు అంశాలను సదస్సులో పాల్గొన్న నాయకులకు వివరించడం జరిగింది. అడ్వకేట్ అద్దంకి రమేష్ గారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత క్రైస్తవులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు మరియు తాకీదులు వివరిస్తూ దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా వస్తున్న ప్రభుత్వ ఉత్తర్వులకు సమిష్టిగా పోరాడాలని తెలిపారు.

ఇంటర్లెక్చువల్ ఫోరమ్ కార్యదర్శి పిచ్చపోగు రవి గారు మాట్లాడుతూ దళిత క్రైస్తవులు, వివిధ సంఘాల నాయకులు అందరు కలిసి గురువులు మరియు పీఠాధిపతుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశాలలో నాయకులు ఎంతో నైపుణ్యం సంపాదించుకొని దళిత క్రైస్తవులకు జరుగుతున్న వివక్షత పైన సమిష్టిగా శాంతి పోరాటాలు చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమం TCBC కమిషన్ SCBC ప్రాంతీయ కార్యదర్శి డాక్టర్ ఎలీషా కుమార్ కలివెల గారి నాయకత్వంలో విజయంతంగా నిర్వహించబడింది. 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో ఈ కమిషన్ కోసం ప్రతి మేత్రాసనంలో ఈ కమిషన్ యొక్క పేద దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న వివక్షత హక్కుల కొరకై కమిషన్ ఆశయాలను విజయవంతం చేయుటకు అంకితభావం, పట్టుదల కలిగిన మేధావులు, న్యాయవాదులు, సంఘ నాయకులు, మహిళా నాయకులు నిరంతర కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వంద మంది నాయకులు, నాయకురాళ్లు, గురువులు, మేధావులు పాల్గొనడం జరిగింది. 

Add new comment

16 + 0 =