దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు

Laura Haricane
దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు

దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు.

లౌర చండమారుతము వల్ల అత్యధికంగా దెబ్బ తిన్న Lake Charles విచారణను ఆదుకోవడానికి New Orleans అగ్ర విచారణ Houma-Thibodaux , మరియు దగ్గర లోని కొన్ని విచారణలు Lake Charles విచారణకు సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చాయి.

ఆగష్టు 31 న వీరందరూ కలిసి Lake Charles విచారణకు ఆహారము, నీరు మరియు నిత్యావసర వస్తువులు ఉన్న ట్రక్కులతో వెళ్లారు.  అక్కడి వారు వీరిని ఎంతో ప్రేమగా ఆహ్వానించారు.

ఒకప్పుడు వచ్చిన కాథరిన్ తుఫాను వచ్చినప్పుడు ఆహరం కోసం అలమటిస్తూ, సహాయం చేసే వారికోసం ఆశగా ఎదురు చూసాను అని ఫాదర్  Howard అనే గురువు అన్నారు. ఇదే తాను 200 మైళ్ళ దూరాన్ని కూడా లెక్క చెయ్యకుండా   Lake Charles విచారణ కు ట్రక్కు నడుపుకుంటూ రావడానికి ప్రేరేపించింది అన్నారు.

ఈ నిత్యావసరాలు మాత్రమే కాకుండా 10 ,000 డాల్లర్ల నగదు సహాయాన్ని కూడా వీరు చేసారు. ఈ చర్య ద్వారా క్రీస్తు బోధించిన బోధలు మన జీవితాలలో పాటించాలని వారు చాటిచెప్పారు.  

Add new comment

8 + 8 =