థర్డ్ వేవ్ | covid 3rd wave

 ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ డెల్టా వేరియంట్ జులై 13 నాటికి 111 దేశాల్లో  ఉందని, మున్ముందు ఇది మరింత పెరిగే అవకాశం ఉందని , అలాగే ఆల్ఫా వేరియంట్ 178 దేశాల్లోనూ, బీటా రకం 123, గామా వేరియంట్ 75 దేశాల్లోనూ ఉనికిలో ఉన్నట్టు  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి హెచ్చరికలు చేసింది. థర్డ్ వేవ్ ముప్పు ముంగిట ఉన్నామని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథ్నామ్ హెచ్చరించారు. కొత్త, ప్రమాదకరమైన వేరియంట్లు వైరస్ ఉద్ధృతికి దోహదం చేస్తున్నాయని దీని ఫలితంగా మరింత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయని టెడ్రోస్ అన్నారు. వ్యాక్సిన్లు అందరు వేసుకోవాలని, ప్రజలు చైతన్యం తో  భౌతికదూరం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలను పాటించాలని కోరారు. పలు దేశాలు ఇటువంటి చర్యలతోనే కోవిడ్-19ను అడ్డుకుంటున్నాయని గుర్తుచేశారు.

మన ప్రధాన మంత్రి  శ్రీ నరేంద్ర మోడీ  ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో కొవిడ్‌-19 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అప్రమత్తంగా ఉండాలని, వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రులకు సూచించారు.దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్నారు.రాబోయే 100- 125 రోజులు అత్యంత కీలకమని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ హెచ్చరించారు. మూడో ముప్పును ఎదుర్కొనేందుకు  యావత్‌ ప్రపంచం సిద్ధమవుతుండగా, మనమందరం  బాధ్యతగా వ్యవహరించి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని వీకే పాల్ సూచించారు.

Add new comment

1 + 0 =