తొలి తెలుగు కార్డినల్ - తెలుగువారికి గర్వకారణం

 తొలి తెలుగు కార్డినల్ గా ఎన్నికైన హైదరాబాద్ అగ్రపీఠాధిపతి మహా పూజ్య పూల ఆంతోని గారి    అభినందన సభను మహారాణి పేటలోని బిషప్ హౌస్ లో గల  సువార్త శుభోధ నిలయంలో విశాఖ అతిమేత్రాసనం, ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ విశాఖ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు.  

తొలి తెలుగు కార్డినల్ గా హైదరాబాద్ అగ్రపీఠాధిపతి పూల ఆంతోని ఎంపిక కావడం తెలుగువారికి గర్వకారణం మని విశాఖ అగ్ర పీఠాధిపతి మహా పూజ్య డాక్టర్ మల్లవరపు ప్రకాశ్ గారు  పేర్కొన్నారు.  

 పొప్ ఫ్రాన్సిస్ గారు ప్రపంచ వ్యాప్తంగా 21 మంది కార్డినల్స్ ను  ప్రకటించిన విషయం మనకు తెలిసినదే.  కార్డినల్  హోదాతో పోప్ ఎన్నికల్లో  పాల్గొంటారు . ఈ   కార్యక్రమంలో విశాఖ అగ్ర పీఠాధిపతి మహా పూజ్య మల్లవరపు ప్రకాష్, వికార్ జనరల్ గురుశ్రీ  దుగ్గంపూడి  బాలశౌరి, ఛాన్సలర్ గురుశ్రీ  జొన్నాడ జాన్ ప్రకాష్, డీన్ గురుశ్రీ  రాజకుమార్, ఆల్ ఇండియా కేథలిక్ యూనియన్ విశాఖ మండల అధ్యక్షులు రవీంద్ర శేషుబాబు, స్వామినాధం తదితరులు పాల్గొన్నారు.

Add new comment

13 + 4 =