తెలుగు సిగ్నిస్ సభ్యుల సమావేశం 

జూమ్ సమావేశంతెలుగు సిగ్నిస్

22 సెప్టెంబర్ 2022 న తెలుగు సిగ్నిస్ సభ్యుల జూమ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత సిగ్నిస్ సెక్రటరీ గురుశ్రీ విక్టర్ విజయ్ లోబో గారు,  తెలుగు  సిగ్నిస్ ప్రెసిడెంట్ గురుశ్రీ ఉడుముల బాలశౌరి, సెక్రటరీ గురుశ్రీ పప్పుల సుధాకర్ మరియు తెలుగు సిగ్నిస్ సభ్యులు పాల్గొన్నారు. 

తెలుగు సిగ్నిస్ ప్రెసిడెంట్ గురుశ్రీ ఉడుముల బాలశౌరి గారి స్వాగత పలుకులతో ఈ సమావేశం ప్రారంభమయింది. సెక్రటరీ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు నూతన సభ్యులను పరిచయం చేసి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని సభ్యులకు వివరించారు. అనంతరం  
గురుశ్రీ విజయ్ లోబో గారు సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, సిగ్నిస్ లో సభ్యులుగా వారికి ఉన్న బాధ్యతలు, వారు చేయవలసిన పనులు మరియు వారి పరిచర్యకు సిగ్నిస్ అందించే సహాయం గురించి వివరించారు.

సభ్యులు సిగ్నిస్ నుండి సహాయం ఎలా పొందవచ్చు, దానికి వారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు, దరఖాస్తును ఎలా పూర్తి చేయాలో విపులంగా సభ్యులకు చూపించారు.

రానున్న సంవత్సరంలో సిగ్నిస్ ద్వారా సభ్యులు అనేక సృజనాత్మక కార్యక్రమాలు చేయాలని ఆయన సభ్యులను సూచించారు.

Add new comment

3 + 1 =