తూడి విచారణలో స్వస్థతా ప్రార్ధన కూటాలు

శ్రీకాకుళం మేత్రాసనం, తూడి విచారణ, కానుకమాత దేవాలయం నందు అద్భుతశక్తిగల పాదువాపురి పునీత అంతోని వారి స్వస్థతా ప్రార్ధన కూటాలు మరియు దివ్యబలిపూజ ఆగష్టు 02,2022 మంగళవారం రోజున సాయంత్రం 3:00 గంటలకు భక్తియుతంగా జరిగింది.  
 
శ్రీకాకుళ మేత్రానులు మహా ఘన రాయరాల విజయకుమార్ తండ్రిగారు పవిత్ర దివ్యబలిపూజను సమర్పించారు. దివ్యపూజలో తండ్రిగారు పాదువాపురి పునీత అంతోని వారి భక్తి మరియు విశ్వాసాన్ని గూర్చి వివరించారు. గురుశ్రీ విజయ్ చందర్ గారు పూజాబలిలో విశ్వాసుల కొరకు ప్రార్ధించారు. విజయనగర వాసులు బ్రదర్ పి.చిట్టిబాబు గారు స్తుతి ఆరాధనా మరియు ప్రభుని వాక్యపరిచర్యతో విశ్వాసులను భక్తి మార్గంలోకి నడిపించారు. విచారణ గాయక బృందం పవిత్ర గీతాలను మధురంగా ఆలపించారు. 
 
కూటాలకు విశ్వాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. విచారణ కర్తలు గురుశ్రీ ఉర్లాపు సునీల్ జోసఫ్ గారు ప్రార్ధన మరియు దివ్యబలిపూజకు విచ్చేసిన మేత్రానులకు, గురువులకు, హోలీ క్రాస్ మఠవాసులకు, ఉపదేశులకు,విశ్వాసులకు, విచారణ ప్రజలకు, సంఘపెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
 
తూడి విచారణను ఆ దేవాదిదేవుడు ఎల్లపుడు దీవించాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు.

Add new comment

1 + 1 =