తూడి విచారణలో ఘనంగా పునీత అంథోని వారి పండుగ వేడుకలు

తూడి విచారణపునీత అంథోని వారి పండుగ

శ్రీకాకుళం మేత్రాసనం లోని తూడి విచారణలో పునీత అంథోని వారి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు శ్రీకాకుళం మేత్రాసన పీఠాధిపతి మహా పూజ్య. రాయరాల విజయ్ కుమార్ గారు విచ్చేసి దివ్యబలి పూజను అర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పునీత ఆంథోనీ గారు తన జీవితంలో క్రీస్తును ఎలా అనుసరించారో, ఒక సామాన్య వ్యక్తి నుండి పునీతునిగా ఆయన ఎలా ఎదగగలిగారో వివరించారు. అంథోని గారి వేడుదల వలన జరిగిన అద్భుతాలను గుర్తు చేసారు.

విశ్వాసులందరు పునీత అంథోని గారిని ఆదర్శంగా తీసుకొని తమ విశ్వాసాన్ని బలపరచుకోవాలని ఆయన విశ్వాసులకు పిలుపునిచ్చారు.

ఈ పండుగకు విశ్వాసులు అధికసంఖ్యలో పాల్గొని పునీత అంథోని గారి వేడుదల కోసం ప్రార్ధించారు.

Add new comment

2 + 4 =