తీవ్ర తుపానుగా యాస్

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్‌ తుఫాన్ ప్రస్తుతం ఒడిశా తీరానికి సమీపంలో ఉంది.  మంగళవారం ఉదయం 8.30 సమయానికి  పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. ఇది పెను తుపానుగా మారి ఒడిశాలోని పారాదీప్, పశ్చిమబెంగాల్‌లోని సాగర్ ఐలాండ్ మధ్య బుధవారం మధ్యాహ్నం తీరం దాటొచ్చని పేర్కొంది. ఏపీ తీర ప్రాంతంలో గంటకు 40నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇదే తీవ్రత కొనసాగుతుందని వెల్లడించారు. ప్రభావిత తీరాల్లో సముద్రం అత్యంత కల్లోలంగా ఉంటుందని వాత‌వ‌ర‌ణ శాఖ నిపుణులు హెచ్చరించారు.

 ‘‘యాస్' తుపాను ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుఫాన్ దృష్ట్యా ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Add new comment

6 + 1 =