తవ్వకాలలో బయట పడిన 1200 ఏళ్ళ నాటి పురాతన సిలువ, ఎక్కడ దొరికిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Cross in PakisthanVillagers observe the huge Christian cross in Kavardo, Baltistan. (Photo: pamirtimes.net)

తవ్వకాలలో బయట పడిన 1200 ఏళ్ళ నాటి పురాతన సిలువ, ఎక్కడ దొరికిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు 

 

పాకిస్తాన్ లోని స్కర్దు పర్వతాలలో మూడు టన్నుల బరువు గల 1200 ఏళ్ళ నాటి ఒక పురాతన సిలువను పరిశోధకులు కనుగొన్నారు.

స్కర్దు లోని బాల్తిస్తాన్ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం, బాల్తిస్తాన్ లోని పర్వత శ్రేణులలో ఉన్న కావార్డో అనే గ్రామం వద్ద జరిపిన పరిశోధక తవ్వకాలలో, పాల రాతితో తయారు చెయ్యబడిన ఈ సిలువ ఆశ్చర్యకరంగా బయట పడింది.  

బాల్తిస్తాన్ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులైన ప్రొఫెసన్ డాక్టర్ ముహమ్మద్ నయీమ్ ఖాన్ గారి నేతృత్వం లోని ఈ బృందం లో విశ్వ విద్యాలయ విద్యా విధాన నిర్దేశకులు డాక్టర్ జాకిర్ హుస్సేన్ జాకిర్, బాహ్య సంబంధాల నిర్దేశకులు డాక్టర్ ఇష్టియాక్  హుస్సేన్ మఖ్పూన్ కూడా ఉన్నారు. 

సింధు నదికి ఆనుకొని ఉన్న బలిస్తాన్ లోని పర్వత శ్రేణులలో ఉన్న కావార్డో గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సిలువను కనుగొన్నారు. ఇది మూడు నుండి నాలుగు టన్నుల బరువు మరియు ఆరు నుండి ఏడు అడుగుల ఎత్తు ఉందని, ఈ బృందం వారు విలేకరులకు తెలిపారు.

ప్రాధమిక అంచనాల ప్రకారం ఈ సిలువ 1000 నుండి 1200 ఏళ్ళ క్రితం నాటిదని, ఆ ప్రాంతంలో క్రైస్తవత్వం ఉండేది అని అంటున్నారు.

పాకిస్తాన్  లో పురాతన సిలువలను పరిశోధించే వాజిద్ భట్టి దీనిని చూసి, దీనిని ఎక్కడ చేసిఉంటారో గుర్తించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఇది భారత దేశంలో చేసిన దానిలా ఉందని, క్రీస్తు శకం 52 లో అపోస్తులుడైన పునీత తోమా గారు భారత దేశం వచ్చిన అనంతరం తయారు చెయ్యబడిన సిలువ అయిఉండవచ్చు అని ఆయన అన్నారు.

బాల్తిస్తాన్ విశ్వవిద్యాలయ బృందం వారు, ఉత్తర అమెరికా మరియు ఐరోపా దేశాలలోని విశ్వవిద్యాలయాలను సంప్రదించి ఈ సిలువను గూర్చిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామని అన్నారు.
ccc
క్రైస్తవులమైన మనకు ఇది ఒక గొప్ప శుభవార్త అని, దీనిని బట్టి చుస్తే ఇక్కడ ఒకప్పుడు క్రైస్తవత్వం ఉండేదని, తప్పకుండ ఒక చర్చి కూడా ఉండిఉంటుందని, ఐతే ఇప్పుడు ఇక్కడ క్రైస్తవులు ఎవ్వరు లేరని కానీ ఒకప్పుడు ఉంది ఉండవచ్చని పాకిస్తాన్ లోని కరిథాస్ కార్యదర్శి అయిన మన్ష నూర్ ఆనందాన్ని వ్యక్తం చేసారు.

Add new comment

7 + 7 =