తలితకుము సంస్థ ప్రతినిధులను కలిసిన పాపు గారు

TalitakumTalitakum

తలితకుము సంస్థ ప్రతినిధులను కలిసిన పాపు గారు

 

తమ  10 వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తలితకుము సంస్థ ప్రతినిధులను ఫ్రాన్సిస్ పాపు గారు గురువారం 26 సెప్టెంబర్ 2019 న కలిశారు. ఈ సంస్థలో 2000 మందికి పైగా వివిధ సంస్థలకు చెందిన మఠకన్యలు, మనుషుల అక్రమ రవాణా కు వ్యతిరేకంగా పోరాడుతూ, దానివల్ల బాధితులకు సహాయం చేస్తున్నారు. వీరి ఉప కార్యాలయాలు 90 దేశాలలో ఉన్నాయి.

ఈ సంస్థ కు చెందిన వారు, వారు పని చేస్తున్న ప్రదేశంలోని విచారణ తో కలిసి పనిచేస్తూనే,  మనుషుల అక్రమ రవాణాకు సంబంధించిన అవగాహన అక్కడి ప్రజలలో తేవడానికి కృషిచేస్తారు.

వారు తమ పనిని ఇంకా స్వేచ్ఛగా చేయలేకపోవడంలో గల ప్రాముఖ్యతను ఆయన వివరించారు

"ఈ ప్రత్యేక కార్యము నుండి బైటకు వస్తే మీరు కాథోలిక సమాజంలో భాగస్తులే. కలిసి పని చేయకుంటే కష్టమే అవుతుంది.
మీ సహజ స్వభావ స్వరూపాల ద్వారా నేటి కాథోలిక సమాజం మీకు సహకరించడానికి మీరు మార్గాలు వేసుకున్నారు."  అని అన్నారు.

ఆశీర్వదించబోయే ముందు పాపు గారు ఒక చివరి సలహాను వారికిచ్చారు: "మీరు కాపాడిన వారిలో ఒక్కరి కళ్ళలోని ఆ కంటిచూపును గూర్చి అయినా ధ్యానించకుండా మీ రోజును ముగించవద్దు "

జేవియర్  రోమేరో
మెలిస్సా  బూట్స్

అనువాదకర్త: అరవింద్ బండి  

Add new comment

3 + 0 =