ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది

దేశ రాజధాని ఢిల్లీ చాలా కాలంగా విపరీతమైన వాయు కాలుష్యంతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఆక్సిజన్ స్థాయి  పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జనవరి 1, 2022 వరకు దేశ రాజధానిలో టపాసులపై నిషేధం ఉన్నప్పటికీ, గురువారం రాత్రి ప్రజలు దీపావళి సందర్భముగా  పటాకులు కాల్చడంతో వాయు కాలుష్యం అలముకుంది.

దీపావళి టపాసుల ప్రభావం దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై తీవ్రంగా పడింది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది.ఢిల్లీ శివారు ప్రాంతం నోయిడాలో అత్యధికంగా వాయు కాలుష్యం కమ్ముకుంది.  

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 దాటిందంటే తీవ్రమైన వాయు కాలుష్యం అని అధికారులు తెలిపారు. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంతో నోయిడాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 526కు పెరిగింది.

 

 

Add new comment

5 + 9 =