జీవస్వరం ఆధ్యాత్మిక స్వస్థత కూటాలు

ఆదిలాబాద్ మేత్రాసనం, హోలీ ఫ్యామిలీ దేవాలయం, పునీత జోజప్ప గారి పాఠశాల ప్రాంగణంలో సెప్టెంబర్ 30, మరియు అక్టోబర్ 1,2, మూడు రోజుల పాటు జీవస్వరం ఆధ్యాత్మిక స్వస్థత కూటమును ఆదిలాబాద్ సువార్త విభాగం వారు ప్రారంభించారు.. 

సెప్టెంబర్ ౩౦ సాయంత్రం  4:00 గంటల నుండి 5:00 గంటల వరకు దివ్యసత్ప్రసాద ఆరాధన, మరియు బైబిల్ ప్రదక్షణ, ప్రతిష్ట జరిగింది. 

ఆదిలాబాద్ మేత్రానులు మహా పూజ్య ప్రిన్స్ అంథోని తండ్రి గారు, గురువులు, సిస్టర్లు, దైవప్రజలు దీప ప్రజ్వలన జరిపి జీవస్వరం 2022 సువార్త స్వస్థత కూటములను ప్రారంభించారు. 

ఈ మూడు రోజుల ప్రార్ధన కూటములో మేత్రానుల వారు వాక్యపరిచర్య చేయగా గురువులు, మఠకన్యలు స్తుతి ఆరాధనలు మరియు గీతాలాపనలు జరిపెదరు.  

ఈ కార్యక్రమాన్ని మీరు కూడా వీక్షించి స్వస్థత పొందాలి అనుకుంటున్నారా, ఐతె జీవస్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి రోజు సాయంత్రం 5:00 గం|| నుడి 09:00  గంటల వరకు ప్రత్యక్షంగా వీక్షీంచవచ్చు . ఈ సువర్ణావకాశంను సద్వినియోగం  చేసుకొని ఆ ప్రభుని ఆశీర్వాదాలు పొందండి.

Live Stream link  : https://youtu.be/JKi7IQQIlxs

Add new comment

13 + 3 =