జాతీయ SIGNIS కార్యవర్గ సభ్యుల నూతన నియామకం

నవంబర్ 24, 2022న జైపూర్ మేత్రాసనం,జయపుర పాస్టరల్ సెంటర్, జ్ఞానదీప భవన్  నందు జరిగిన జాతీయ స్థాయి సిగ్నిస్ సమావేశంలో (SINA  2022 ) 2023-2027  సంవత్సరాలకుగాను నూతన కార్యవర్గ సభ్యులను నియమించడం జరిగింది
 
SIGNIS జాతీయ అధ్యక్షుడిగా - మంగుళూరు మేత్రాసనానికి చెందిన గురుశ్రీ విక్టర్ విజయ్ లోబో
ఉపాధ్యక్షులుగా : శ్రీ సుమిత్ ధనరాజ్
కార్యదర్శిగా : గురుశ్రీ డేవిడ్ అరోకియం (మాతా టీవీ, CEO)
కోశాధికారిగా : గురుశ్రీ మిల్టన్ సెబాస్టియన్ గార్లు ఎంపికచేయబడ్డారు.

SIGNIS, స్క్రీనింగ్ కమిటీ నూతన సభ్యులుగా సిస్టర్ టెస్సీ జాకబ్ మరియు గురుశ్రీ  సి.ఆర్. జస్టి గార్లను ఎన్నుకున్నారు.

SIGNIS జాతీయ నూతన కార్యవర్గ సభ్యులందరికి అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం వారి తరుపున హార్ధిక శుభాకాంక్షలు  

Add new comment

1 + 8 =