జాతీయ వైద్యుల దినోత్సవం

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల నుండి ప్రపంచాన్ని కాపాడిన దేవదూతలుగా  వైద్యులు మనకు ఎన్నో సేవలు చేశారు.  తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడిన దేవుళ్ళుగా మనం  వైద్యులను పరిగణించవచ్చు.

భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జూలై 1 న జరుపుకుంటారు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ (1882 జూలై 1 - 1962 జూలై 1) జయంతి (మరియు వర్ధంతి) అయిన జూలై ఒకటవ తేదీని భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తారు.జాతీయ వైద్యుల దినోత్సవాన్ని  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) నిర్వహిస్తుంది.

డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ 1, 1882 న జన్మించాడు 1962 లో అదే తేదీన మరణించాడు.మరియు 80 సంవత్సరాల వయస్సు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఫిబ్రవరి 4, 1961లో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం, భారతరత్న పురస్కారంతో సత్కరించింది.

ఈ కరోనా సమయం లో తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి పీపీఈ కిట్లతో,  మాస్క్‌లతో రోజులు తరబడి  సేవ చేస్తూ,   తమ వృత్తిపట్ల అంకితభావంతో కరోనా రోగులకు వైద్యం అందించి చిరునవ్వుతో ఇంటికి పంపుతున్నారు.
అటువంటి నిస్వార్థమైన సేవ చేస్తున్నటువంటి వైద్యులకందరికి  జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు

Add new comment

3 + 2 =