జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవం

ప్రతి సంవత్సరం జనవరి 11వ తేదీని యునైటెడ్ స్టేట్స్‌లో జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవం (నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్‌నెస్ డేగా) పాటిస్తారు. లైంగిక బానిసత్వం మరియు మానవ అక్రమ రవాణా గురించి అవగాహన కల్పించడం మరియు వాటిని పూర్తిగా అంతం చేయడం ఈ రోజు లక్ష్యం. మానవ అక్రమ రవాణా వ్యవస్థ నుండి బయట పడిన వారికి సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉజ్వల అనే పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించినది.
 
కుటుంబ లో బలహీనతల వల్ల,  డబ్బు కోసం అత్యాశతో  ఉచ్చులో చిక్కుకున్న వారు ఎందరో ఉన్నారు. కుటుంబాల పేదరికం ఆసరాగా ఉపాధి పేరుతో ముఠాలు ఆకర్షించి నప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోకుండా మోసపోవడం ,ఎక్కువ వేతనాలను నమ్మి చిక్కిపోవడం వంటివి కూడా మనం చూస్తున్నాము. కుటుంబ లో బలహీనతల వల్ల,  డబ్బు కోసం అత్యాశతో  ఉచ్చులో చిక్కుకున్న వారు ఎందరో ఉన్నారు. కుటుంబ పేదరికం ఆసరాగా ఉపాధి పేరుతో ముఠాలు ఆకర్షించి నప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోకుండా మోసపోవడం ,ఎక్కువ వేతనాలను నమ్మి చిక్కిపోవడం వంటివి కూడా మనం చూస్తున్నాము. ప్రేమ పేరుతో, కన్నవారిని వదిలి వచ్చిన ఆడబిడ్డలు  ఇలాంటి  ముఠాలకు చిక్కిన కథలు అనేకం. కొన్ని నివేదికల ప్రకారం, ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20-30 మిలియన్ల మంది బానిసలుగా ఉన్నారు.  రికార్డుల ప్రకారం అక్రమ రవాణా ముఠాల బారిన పడుతున్న వారిలో 90 శాతం మంది నిరుపేద ,వెనుకబడిన తరగతులకు చెందిన వారే.  ఆర్థిక లాభం కోసం 14,15 ఏళ్ళ వారిని  దుబాయ్ షేక్ లకు అమ్మేసిన  వార్తలు  మనం వింటున్నాము .
 
ఇలాంటి నేరాలు అనుకోకుండా జరుగుతున్నవి కావు...  మన సమాజం లో నేరపూరిత అసాంఘిక శక్తులు చేస్తున్నటువంటి ఇటువంటి పనులను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అడ్డుకట్ట వేయాలని మనసారా కోరుకుందాం.

Add new comment

1 + 6 =