చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనావైరస్ కేసులు

చైనాలో మళ్లీ కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా వందకు పైగా కోవిడ్ కేసులు బయటపడ్డాయి. వారం రోజుల్లో 11 ప్రావిన్సుల్లో కొత్త కేసులు వెలుగు చూసాయి. అన్నీ కూడా ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కేసులే. మళ్లీ కోవిడ్ విజృంభించే అవకాశం ఉందని చైనా ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. చైనా ప్రభుత్వం  ప్రయాణాల ఆంక్షలు విధించింది, కోవిడ్  టెస్టుల సంఖ్యను పెంచింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. వైరస్ బారినపడ్డ వారిలో ఎక్కువ మందికి ట్రావెల్ హిస్టరీ ఉందని నిర్దారించారు .
  కోవిడ్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటనలపై నిషేధం విధించింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో బీజింగ్ మారథాన్‌ను నిరవధికంగా వాయిదా వేశారు.

Add new comment

5 + 9 =