Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
చైనాలో కరోనా వైరస్ రోజు రోజుకూ మరింత విజృంభిస్తోంది.
చైనాలో కరోనా వైరస్ రోజు రోజుకూ మరింత విజృంభిస్తోంది. ఈ వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 350కి చేరుకోగా, మరో 12000 మందికి ఈ వైరస్ సోకినట్లు చైనా ప్రకటించింది. వీరిలో 1,795 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. గడిచిన 24 గంటల్లో ఈ వైరస్ సుమారు 50 మంది ప్రాణాలు బలితీసుకోవడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది.
వైరస్ తీవ్రత నేపథ్యంలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ( (WHO) పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.
కరోనా వైరస్ నిర్ధారణ అయిన 218 మంది రోగులు కోలుకున్నారని, వారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినట్టు భారత్‌లోని చైనా రాయబారి సన్ వయడాంగ్ తెలిపారు .
నేటి నుండి హైదరాబాద్‌లో కరోనా వైద్య పరీక్షలు :
ఇవాళ్టి నుండి కేంద్ర ప్రభుత్వ అనుమతితో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలోనే కరోనా వైరస్ టెస్టులు చేస్తున్నారు. ఎవరికైనా దగ్గు, తుమ్ములు కంటిన్యూగా 10 నిమిషాలకు మించి ఉంటే , ముక్కు కారుతూ ఉంటే, జ్వరంతోపాటూ ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపిస్తూ ఉంటే అలాంటి వారు వెంటనే గాంధీ ఆస్పత్రికి వెళ్లడం మంచిది .అక్కడ ప్రత్యేక విడిగా ఏర్పాటు చేసిన కేంద్రంలో ప్రత్యేక కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుపుతారు. ఫలితాల్లో కరోనా వ్యాధి సోకినట్లు తెలిస్తే , వెంటనే ఆ వ్యక్తిని ప్రత్యేక కేంద్రంలో ఉంచి రెగ్యులర్‌గా జ్వరాలు, జలుబు, దగ్గు తగ్గేందుకు ఇచ్చే మందులు ఇస్తూ ఉంటారు. అలాగే ఆ వ్యక్తి ఇంకెవరినీ కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం పంపిన కిట్లను ఇస్తారు. అలాగే ఎప్పటికప్పుడు ఆ వ్యక్తిని డాక్టర్లు పర్యవేక్షిస్తూ ఉంటారు. వైరస్‌పై ఏవైనా డౌట్లు ఉంటే అడిగేందుకు 24 గంటల కాల్‌సెంటర్ ఏర్పాటు చేశారు. 040–24651119కు ఫోన్ చేసి డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు.
Add new comment