చెన్నైపై పగబట్టిన వరుణుడు

మొన్న కురిసిన  భారీ వర్షాలకు చెన్నై రోడ్లు సరస్సులను తలపిస్తున్నాయి. 12 గంటల్లోనే 23సెంటీమీటర్ల వర్షం పడింది.   చెన్నైలోని చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.  జలాశయాలు నిండుకుండల్లా మారాయి. పూండి, చెంబరంబాక్కం, పుళల్ డ్యామ్‌లలో వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. రేపు, ఎల్లుండి వ‌ర్షాలు పడే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాలు రెండు మూడు రోజులుగా నీటిలోనే ఉండడంతో ప్రజలకు అంటు వ్యాధులు ప్రబలకుండా తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎక్కడకి అక్కడ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తోంది.

Add new comment

8 + 10 =