చివరి దశకు చేరుకున్న అమెజాన్ సినడ్ 

Amazon SynodAmazon Synod

చివరి దశకు చేరుకున్న అమెజాన్ సినడ్ 

అమెజాన్ సినడ్ ఇప్పుడు అంత్య దశకు చేరుకుంది. చర్చించిన విషయాలను గూర్చిన తుది నివేదికకు కార్డినల్ క్లాడియో హుమ్స్ సవరణలు చేస్తున్నారు. 12 మంది సభ్యులతో కూడిన ఒక బృందం ఈ నివేదికలో సినడ్ లో చర్చించిన విషయాలన్నీ పొందుపరచబడ్డాయా లేదా అని పరిశీలిస్తుంది.
 
ఈ బృందంలో నలుగురు సభ్యులను పాపు గారు స్వయంగా ఎన్నుకున్నారు. వారిలో ఒకరైన వియన్నా అగ్ర పీఠాధిపతి కార్డినల్ క్రిస్టోఫ్ స్చన్బోర్న్ విలేఖరులతో మాట్లాడుతూ "కాథోలిక సమాజంలో స్త్రీ యొక్క పాత్ర మరియు అభిషిక్తులైన గురువులు,కన్యస్త్రీల యొక్క పాత్రను గూర్చి కొన్ని విషయాలను ఈ సినడ్ లో చర్చించడం జరిగింది. వీటిని గూర్చి తండ్రిగారి వద్ద ఏమి వినతులు సమర్పింప బడతాయి అనేది సినడ్ ముగిసిన తర్వాత తెలుస్తుంది" అని అన్నారు.

తుది నివేదిక యొక్క ప్రతులను, శుక్రవారం  24 అక్టోబర్ న సినడ్ లోని  185 మంది గురువులకు అందజేస్తారు. వారు కొన్ని గంటల వ్యవధిలో ఈ నివేదికను చదివి వారికి సముచితమనిపించు మార్పులేమైనా ఉంటే సూచించ వచ్చు.  అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినడ్ అమెజాన్ లో బాధలు అనుభవిస్తున్న దీన ప్రజలు అక్కడి పర్యావరణ పరిస్థితుల వైపునకు ప్రపంచ ద్రుష్టిని త్రిప్పగలిగింది.

25 అక్టోబర్, శనివారం సాయంత్రం సినడ్ లోని  185 గురువులు చర్చించిన అంశాలకు తమ ఓట్లను వేస్తారు. దీని ద్వారా ఏ అంశం పై మొదట ద్రుష్టి ఉంచాలో తెలుస్తుంది.

సినడ్ లోని 12 బృందాలలో 6 బృందాలు వివాహితులైన మగవారు గురువులు గా పనిచెయ్యవచ్చు అని అభిప్రాయపడగా 2  బృందాలు దానిని వ్యతిరేకించాయి. కాగా 3 బృందాలు ఈ అంశాన్ని ఇంకా పరిశీలించాలని అభిప్రాయ పడ్డాయి. 
స్త్రీలను శాశ్వత డీకన్లుగా అభిషేకించివచ్చు అనే అంశానికి 7 బృందాలు తమ సానుకూలతను తెలిపాయి.
సామాన్య స్త్రీ పురుషుల ద్వారా సువార్త సేవ ఇంకా మెరుగు పరచాలి అను అంశానికి అన్ని బృందాలు అభిముఖంగా స్పందించాయి.

సినడ్ అనేది పాపు గారి సంప్రదింపునకు ఏర్పరచబడిన ఒక బృందం. ఈ బృందం చర్చలను జరిపి తమ నివేదికను తయారుచేసి కాథోలిక సమాజంలో రావలసిన మార్పులను చెయ్యవలసిన పనులను ఆ నివేదిక ద్వారా పాపుగారికి విన్నవించుకుంటుంది. ఈ శనివారం ఆ నివేదిక పాపుగారికి సమర్పింప బడుతుంది. వాటిపై పాపుగారు రాబోవు మాసాలలో ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకు తెలియజేస్తారు

జేవియర్ మార్టినెజ్ బ్రోకల్
అనువాదకర్త: అరవింద్ బండి 

 

Add new comment

2 + 2 =