చర్చి నిర్మాణానికి టెండర్లు

చర్చి నిర్మాణానికి టెండర్లు :

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులిస్తుంది. దేశంలో చర్చిలు, మసీదుల నిర్మాణానికి  దాతలు నుంచి, విదేశాలనుండి  విరాళాలు సేకరించి చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలు నిర్మిస్తుంటారు. ఐతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మైనార్టీ సంక్షేమంలో భాగంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా చరిత్రలో మొదటిసారిగా జగనన్న ప్రభుత్వం చర్చి నిర్మించేందుకు టెండర్లు పిలిచింది.

గుంటూరు జిల్లా, రొంపిచర్ల మండల కేంద్రంలో నూతన చర్చ నిర్మించేందుకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పిలిచింది. ‘బేతల్ క్రిస్టియన్ బ్రథర్న్ ట్రస్ట్ చర్చ్’ పేరుతో నిర్మిస్తున్న చర్చ్ కోసం ఈనెల 21లోగా  కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయవచ్చని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. మరియు  6నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని తెలిపింది.

Add new comment

2 + 12 =