చర్చిలో మారణహోమం

చర్చిలో మారణహోమం

 

ఆఫ్రికా దేశం నైజీరియాలో ఉగ్రవాదులు  క్యాథలిక్ దేవాలయం లో మారణహోమానికి తెగబడ్డారు. నైజీరియా నైరుతి ప్రాంతంలో ఒండో రాష్ట్రం ఓవో నగరంలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ దేవాలయం లో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ బాంబు దాడులకు పాల్పడ్డారు.  ఈ దారుణ ఘటనలో 50 మంది చనిపోయినట్లు  అధికారులు తెలిపారు.ఆదివారం ఉదయం స్థానిక కాలమాన ప్రకారం 11 గంటల సమయంలో జరిగింది. చర్చ్‌లో ప్రజలు ప్రార్థనలు చేసుకుంటుండగా.. లోపలికి చొరబడిన ఉగ్రవాది విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ క్యాథలిక్‌ చర్చ్ భయానకంగా మారింది.
ఈ ఉగ్ర దాడిని నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ ఖండించారు. ప్రార్థనలు చేసుకుంటున్న వారిపై కాల్పులు జరపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హేయనీయమైన ఘటన అన్నారు.

 

Add new comment

3 + 15 =