చట్టపరమైన రక్షణకు కోరుతున్న శ్రీలంక కథోలిక గురువు

చట్టపరమైన రక్షణకు కోరుతున్న శ్రీలంక కథోలిక గురువు

దేశం బెదిరిపోయేలా అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న శ్రీలంకకు చెందిన ఒక కథోలిక గురువు, అరెస్టు నుండి రక్షణ కోరుతూ ఆగస్టు 2న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రత్నపురా మేత్రాసనానికి చెందిన అమిలా జీవంత పీరిస్ గారు, పోలీసులు తనను తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేస్తారని భయపడుతున్నారు.
దేశ పౌరుడిగా తాను శాంతియుత పోరాటంలో చురుగ్గా పాల్గొన్నానని ఆయన అంగీకరించారు.
ఆయనతో పనిచేసిన యూనివర్సిటీ విద్యార్థిని మాట్లాడుతూ, "ఫాదర్ జీవంత్ గారు ఎల్లప్పుడూ అహింస కోసం నిలిచేవారు, ప్రజా ఆస్తులకు ఏ రోజు నష్టం కలిగించలేదు అని ఆమె తెలిపారు.
హ్యూమన్ రైట్స్ వాచ్ దక్షిణాసియా డైరెక్టర్ శ్రీ మీనాక్షి గంగూలీ గారు, రాజకీయ కార్యకర్తలను ప్రభుత్వం నిర్బంధిస్తోందని గమనించారు. ప్రజల విశ్వాసాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం తన అణచివేత విధానాలకు స్వస్తి చెప్పాలని HRW విజ్ఞప్తి చేసింది.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న గురువులు, కన్యాశ్రీలు, కార్యకర్తలు, విద్యార్థులు మరియు న్యాయవాదులు అందరు పోలీసుల ఒత్తిడి వ్యూహాలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు

 

Article by

P.Pavan Kumar

RVA Telugu service

Add new comment

2 + 0 =