Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
చంగనాసెరి సిరో మలబార్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య పోవాటిల్ కన్నుమూత.
చంగనాసెరి సిరో-మలబార్ ఆర్కిపార్కీ విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహా పూజ్య జోసఫ్ పోవాతిల్ (92), 18 మార్చి 2023 శనివారం మధ్యాహ్నం 1.17 గంటలకు చంగనాసెరిలో, చేతిపూజాలోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో మరణించారు.
అతను 60 సంవత్సరాలు గురువుగా మరియు 51 సంవత్సరాలు పీఠాధిపతులుగా తన సేవలందించారు.
26 ఫిబ్రవరి 1977న కంజిరపల్లికి మొదటి పీఠాధిపతిగా నియమింపబడి, 12 మే 1977న అభిషేకింపబడ్డారు.
5 నవంబర్ 1985న చంగనాసెరి అగ్రపీఠాధిపతులుగా నియమింపబడ్డారు. 19 మార్చి 2007న పదవీ విరమణ పొందారు.
కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) (1994-1998), కేరళ కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ (1993-1996) అధ్యక్షుడిగా మరియు CBCI ఎడ్యుకేషన్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేసారు.
1930 ఆగస్టు 14న కేరళలోని చంగనాసెరి సమీపంలోని కురుంబనాడోమ్‌లో జన్మించారు.
3 అక్టోబరు 1962న పూణేలో గురుపాటాభిషేకం తర్వాత,తను ఎకనామిక్స్ లెక్చరర్‌గా మరియు చంగనాసెరి సెయింట్ జోసెఫ్ హాస్టల్, సెయింట్ బెర్చ్‌మన్స్ కాలేజ్ వార్డెన్‌గా నియమించబడ్డారు.
41 సంవత్సరాల వయస్సులో 29 జనవరి 1972న చంగనసెరి సహాయక పీఠాధిపతిగా నియమింపబడ్డారు.13 ఫిబ్రవరి-1972న రోమ్‌లో పోప్ పాల్ VI చేత పీఠాధిపతిగా నియమితులయ్యారు.
Add new comment