ఘనం గా పునీత జోజప్ప గారి దేవాలయ పునఃనిర్మాణ ఆశీర్వాదం

విశాఖ అగ్రపీఠం, బొబ్బిలి విచారణ లో గల  పునీత జోజప్ప గారి దేవాలయ పునఃనిర్మాణ ఆశీర్వాదం కార్యక్రమం ఈరోజు ఘనం గా జరిగింది. జపమాల, దేవాలయం చుట్టూ ప్రదక్షిణ తో  ఉదయం 9.00 గం.ల‌కు ఈ కార్యక్రమం ప్రారంభమైనది. విశాఖ అగ్రపీఠాధిపతులు  మహా ఘన. ప్రకాష్ మల్లవరపు గారు దేవాలయాన్ని ఆశీర్వదించి, గురువులతో కలసి దివ్య పూజాబాలి లో పాల్గొన్నారు.  సుమారు ౩౦ మందికి పైగా గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
విచారణ గురువులు గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచారణ ప్రజలు, మఠకన్యలు ,విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు . 

Add new comment

1 + 4 =