ఘనంగా యంగ్ మేరీ మాత మహోత్సవము, నల్లరాయిగూడ విచారణ శ్రీకాకుళం.

దీ : 09-01-2022  నాడు శ్రీకాకుళం పీఠం, నల్లరాయిగూడ విచారణ,యంగ్ మేరీ మాత మహోత్సవం జరిగింది.

శ్రీకాకుళం మెత్రానులు మహా ఘన.రాయరాల విజయ్ కుమార్ తండ్రిగారు దివ్యబాలపూజను అర్పించి యంగ్ మేరీ మాత మహోత్సవం యొక్క విశిష్టతను అక్కడ కూడియున్న విశ్వాసులకు తెలియజేసారు.

ఫా.డొమినిక్ విచారణ గురువులు, ఫా విజయచందర్, ఫా. ప్రకాష్, విచారణ ప్రజలు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు.
యంగ్ మేరీ మాత యొక్క దీవెనలు శ్రీకాకుళం పీఠ ప్రజలపై ఎల్లపుడు ఉండాలను  అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు

Add new comment

19 + 1 =