ఘనంగా బాల యేసును దేవాలయంలో కానుకగా సమర్పణ పండుగ

విశాఖ అతిమేత్రాసనం,క్రీస్తు రాజు పుణ్యక్షేత్రం, యర్ర సామంతవలస గిరిజన విచారణ లో బాల యేసును  దేవాలయంలో కానుకగా  సమర్పణ పండుగను ఘనంగా జరిపారు.

విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు , యర్ర సామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కన్నులపండుగగా జరిగింది.

ఈ పండుగలో క్రీస్తు రాజు పుణ్యక్షేత్రం, యర్ర సామంతవలస గిరిజన విచారణ మరియు చుట్టుపక్కల గ్రామాలనుండి భక్తులు ,విశ్వాసులు అధికసంక్యలో పాల్గొన్నారు.
గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారు  చిన్న బిడ్డల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుచున్నారని తెలిసి  చంటి బిడ్డలతో అధిక సంఖ్యలో విశ్వాసులు యర్ర సామంతవలస చేరుకున్నారు. బాల యేసును  దేవాలయంలో కానుకగా  సమర్పణ పండుగ సందర్భముగా విచారణ విశ్వాసులు అందరు కొవ్వొత్తుల తో  దేవాలయం చేరుకొని ఆ దేవునికి సమర్పించారు.  

ఎప్పటిలానే గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారు ప్రభు యేసుని స్తుతులతో, పాటలతో మహిమపరిచారు. విచారణ ప్రజలందరి కొరకు ప్రార్ధించి పరిశుద్ధ దివ్య పూజ బలిని సమర్పించారు. చిన్నారుల కొరకు ప్రత్యేకంగా  తైలాభిషేక ప్రార్థనలు చేసారు.  ప్రజలందరూ ఆనందం తో ప్రభు సన్నిధిలో గడిపారు.

Add new comment

5 + 10 =