ఘనంగా ప్రారంభమైన "జూబిలీ 2025"

  ఘనంగా ప్రారంభమైన "జూబిలీ  2025"

భారతదేశంలోని శ్రీసభ  అధికారికంగా "జూబిలీ  2025" సన్నాహాలను 26 నవంబర్ 2023 ఆదివారం నాడు ఘనంగా ప్రారంభించింది. వివిధ విచారణలో "జూబిలీ  2025" లోగోను  ఆవిష్కరించి  మరియు "జూబిలీ" ప్రార్థన ను చదివారు.

జూబిలీ యాత్ర, ఆశల తీర్థయాత్ర, ఇది కేవలం ఒక సమావేశం కాదు; ఇది ఒక రూపాంతర అనుభవం, ఇది గురువులు , కన్యస్త్రీలు,విశ్వాసులను  మతపరమైన మరియు విశ్వాసపాత్రులను కలిపే ప్రతిబింబం. ప్రజలందరినీ ఒక మార్గంలో తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది.

గతనెలలో అక్టోబర్ 2023న  ఉడిపి బిషప్ గౌరవనీయులైన మహా పూజ్య  గెరాల్డ్ ఐజాక్ లోబో గారు   "జూబిలీ " యాత్రను ప్రారంభించారు.  నవంబర్ 2025లో జూబిలీ  వేడుకలు ముగిసేలోపు భారతదేశంలోని శ్రీసభ  యొక్క 132 డియోసెస్‌లను సందర్శించాలని రెవ. డాక్టర్ యేసు కరుణానిధి నేతృత్వంలోని నేషనల్ ఫెసిలిటేటింగ్ టీమ్ ఆఫ్ ఆర్డినరీ జూబిలీ  ప్రణాళిక రూపొందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 132 డియోసెస్‌ల సహకారంతో భారత కాథలిక్ బిషప్‌ల కాన్ఫరెన్స్ జూబ్లీ 2025 డెస్క్ ఆధ్వర్యంలో ఈ మహత్తరమైన కార్యక్రమం నిర్వహించబడింది.

జూబిలీ యాత్ర యొక్క ముఖ్య లక్ష్యం జగద్గురువులు మహా పూజ్య  పోప్ ఫ్రాన్సిస్ గారు  చెప్పినట్లుగా ఎక్కువ మంది ప్రజలు 'సైనోడల్- అవగాహనా 'లోకి తీసుకురావడం. జూబిలీ  యాత్ర అనేది కాలినడక ప్రయాణం కాదు,ఇది  హృదయ యాత్ర... దేశమంతటా ఉన్న విశ్వాసులను ఒకటిగా చేసే భాగస్వామ్య ఆశయ సాధనలో కలిపే ఒక ఆధ్యాత్మిక యాత్ర.

నిన్నటి దినాన "జూబిలీ  2025" ను మన తెలుగు రాష్ట్రాలలో వివిధ విచారణలలో ఘనంగా ప్రారంభించారు. జూబిలీ 2025  ప్రార్థనను జగద్గురువులు మహా పూజ్య  పోప్ ఫ్రాన్సిస్ గారు సర్వజనావళికి అందించారు.

జూబిలీ ప్రార్థన
పరలోకమందున్న మా తండ్రీ!
నీ కుమారుడు, మా సోదరుడైన యేసు క్రీస్తులో
నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము,
పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమజ్వాల, రానున్న నీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పునుగాక!
నీ కృపతో మమ్ములను,
సువార్తా విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరకశక్తులు నశించి, మానవత్వం వికసించి, విశ్వాసము హెచ్చింపబడి,
దృఢ సంకల్పంతో కొత్త దివి, కొత్త భువికై నిరీక్షించుటకు మీ మహిమ, వైభవము మాలో నిత్యము వ్యక్తమగునుగాక!
నిరీక్షణ యాత్రికులమైన మాలో, జూబిలీ దైవానుగ్రహము స్వర్గసంపదల పట్ల ఆశను మేల్కొల్పును గాక. రక్షకుని ఆనందము, శాంతి
ప్రపంచమంతటిపై క్రుమ్మరింపబడునుగాక!
సదాకాలం జీవించుచు పాలించు దేవా!
నీకే సదా స్తుతి, మహిమ కలుగునుగాక. ఆమెన్.

 

 

Add new comment

1 + 4 =