ఘనంగా పునీత అంతోని వారి పండుగ | మహారాణి పేట విచారణ

విశాఖ అతి మేత్రాసనం, మహారాణి పేట విచారణ  లో పునీత అంతోని వారి పండుగ  ఘనంగా జరిగింది.
విశాఖ అతి మేత్రాసన వికార్ జనరల్, మహారాణిపేట విచారణ గురువులు  గురుశ్రీ  దుగ్గంపూడి  బాలశౌరి గారి ఆద్వర్యం లో పునీత అంతోని వారి పండుగ  కన్నుల పండుగగా జరిగింది. పండగ రోజు మూడు పూజలు నిర్వహించారు. సాయంత్రం అంతోని వారి తేరు  ఊరేగింపు ఉత్సాహంగా జరిగింది. అనంతరం  శ్రీకాకుళ మేత్రాసన గురువులు  Msgr . దూసి దేవరాజ్ గారి ఆద్వర్యం లో ఇతర గురువులతో కలసి సమిష్టి దివ్యబలిపూజను అర్పించారు.

సుమారు 30 మంది గురువులు  ఈ దివ్య పూజాబలి లో పాల్గొన్నారు. అధికసంఖ్యలో సిస్టర్స్ ఈ పండుగకు హాజరయ్యారు
 సుమారు 50మంది చిన్నారులు నూతనంగా ప్రధమ దివ్యసత్ప్రసాదమును స్వీకరించారు. విచారణ గాయక బృందం పవిత్ర గీతాలను మధురంగా ఆలపించారు.ఈ మహోత్సవానికి విశ్వాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.విచారణ ప్రజలతో  పాటూ వివిధ ప్రాతాలనుండి భక్తులు రావడం జరిగినది. యువతీ యువకులు  దేవాలయాన్ని అందం గా  తయారు చేసారు.
ఈ పండుగ పూజకు విచ్చేసిన ప్రియతమ గురువులకు, మఠవాసులకు మరియు పండుగకు సహాయ సహకారాలు అందించిన విచారణ ప్రజలకు  విచారణ గురువులు  గురుశ్రీ దుగ్గంపూడి  బాలశౌరి గారు ధన్యవాదాలు తెలియజేశారు.

Add new comment

2 + 13 =