ఘనంగా పవిత్ర సిలువ విజయోత్సవ పండుగ

ఘనంగా పవిత్ర సిలువ విజయోత్సవ పండుగ

విశాఖ అతిమేత్రాసనం ఎర్ర సామంత వలస గిరిజన విచారణ , క్రీస్తు రాజు పుణ్యక్షేత్రం లో  క్రీస్తు పవిత్ర సిలువ విజయోత్సవ పండుగ దేవునికి మహిమ కరముగా జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని దేవుని దీవెనలు పొందారు.
విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు , ఎర్ర సామంత వలస విచారణ కర్తలు గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

గురుశ్రీ పరంజ్యోతి గారు ముఖ్య అతిధిగా  పాల్గొని అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు .పునీతలు చెప్పినా గొప్ప విషయాలను  తెలియజేస్తూ  సిలువ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. గురుశ్రీ బోగీ సంజీవి గారు ఈ దివ్యపూజాబాలి లో పాల్గొని ప్రజలందరికొరకు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.గురుశ్రీ డేవిడ్ రాజ్ , గురుశ్రీ సైమన్ , గురుశ్రీ రయ్యప్ప , గురుశ్రీ కళ్యాణ్ , గురుశ్రీ సుధాకర్ , గురుశ్రీ యేసు గార్లతో పాటు  సిస్టర్ ప్రసన్న , సిస్టర్ శాంతి , సిస్టర్ స్వరూప ఇతర సిస్టర్స్ ఈ పండుగ లో పాల్గొన్నారు.

ఈ పండుగలో విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.యువతీ యువకులు , మరియదళ సభ్యులు , విచారణ ప్రజలు పాల్గొన్నారు. శశి గారి  పాటలబృందం మధురమైన గీతాలను ఆలపించారు.విచారణ కర్తలు గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారు  మాట్లాడుతూ  ప్రజలు ఎంతో భక్తశ్రద్ధలతో ప్రభువుని  ఆరాధించారు అని , ఆ ప్రభువుకే మహిమ ఘనత కీర్తి కలుగును గాక అని అన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Add new comment

2 + 1 =