ఘనంగా జీవస్వరం 2023 ఆధ్యాత్మిక స్వస్థత ప్రార్థన కూటములు

ఘనంగా జీవస్వరం 2023 ఆధ్యాత్మిక స్వస్థత  ప్రార్థన కూటములు 

ఆదిలాబాద్, బెల్లంపల్లి, AMC మైదానం నందు జరిగినటువంటి  మూడు రోజుల జీవస్వరం 2023 ఆధ్యాత్మిక స్వస్థత  ప్రార్థన కూటములు  ఘనంగా జరిగాయి.ఆదిలాబాద్ మేత్రాసన సువార్త విభాగం ఆద్వర్యం ఈ కూటములు జరిగాయి. ప్రతిరోజు ప్రతి రోజు సాయంత్రం 5:00 గం|| నుండి రాత్రి  10:00  గంటల వరకు  ఈ ప్రార్థన కూటములు భక్తియుతంగా జరిగాయి. 

ఆదిలాబాద్ పీఠాధిపతులు  మహా పూజ్య ప్రిన్స్ ఆంథోని గారు ప్రభుని ప్రేమను, కృపను  మారుమూల ప్రాంతాలకు సైతం తెలియజేసారు . ఈ మూడు రోజుల జీవస్వరం 2023 ఆధ్యాత్మిక స్వస్థత  ప్రార్థన కూటములలో పాల్గొని దేవుని యొక్క నిత్యజీవ వాక్కు ను ప్రజలకు అందించారు. యేసు ప్రభుని నామం లో ఉన్న గొప్పతనాన్ని ,శక్తిని ప్రజలకు విశ్వాసులకు మహా పూజ్య ప్రిన్స్ ఆంథోని గారు  తెలియజేసారు . ఇతర  గురువులు, మఠకన్యలు స్తుతి ఆరాధనలు మరియు గాయకబృందం  పాటలతో ప్రభుని స్తుతించి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం భక్తిశ్రద్ధలతో నడిపించారు.

ఎఫాత ద్యానకేద్రం డైరెక్టర్ ఫాదర్ గురుశ్రీ కురియన్ గారు మరియు వారి యొక్క బృదం తన సహాయ సహకారాలను అందించారు. తిరుహృదయ దేవాలయ విచారణ కర్తలు గురుశ్రీ PL ఫాదర్ గారు  ముందుండి కార్యక్రం ఏర్పాట్లు చూసుకుంటూ తన సహాయ సహకారాలని అందించారు. పీఠాధిపతులవారు మహాసభ కమిటీ సభ్యులకు , విచారణ గురువులకు, విశ్వాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Add new comment

2 + 0 =