ఘనంగా కర్నూల్ మేత్రాసన గురువుల వార్షిక వడకం

ఘనంగా కర్నూల్ మేత్రాసన గురువుల వార్షిక వడకం

ప్రతి సంవత్సరము వలె కర్నూలు కతోలికాపీఠంలో గురువుల వార్షిక వడకం సెప్టెంబర్ 19వ తారీకు నుండి 23వ తారీకు వరకు జరిగినది. కర్నూలు మెత్రాసన పాలనాధికారి అయిన మోసిగ్నోపా చౌరప్ప గారి ఆహ్వానం మేరకు వడకని నడిపించడానికి జేసుసభ గురువైన గురు శ్రీ జెర్రీ గారు మద్రాసు నుండి వచ్చారు. ఈ వడకానికి కర్నూల్ నేత్రాసన పాస్టల్ సెంటర్ వేదిక అయినది. ఇందులో దాదాపుగా 54 మంది గురువులు పాల్గొనడం జరిగినది. ఈ సంవత్సరం వడకం ఎంతో వినూత్నంగా అర్థవంతంగా జరగడమే కాకుండా గురుత్వ జీవితానికి కొన్ని అపురూపమైన సవాళ్లను సహితం గురు శ్రీ జెర్రీ గారు గురువుల ముందు ఉంచారు.

 ముఖ్యముగా విచారణలో సేవలందిస్తున్న గురువులు విశ్వాసులతో కలసి వారి యొక్క విశ్వాస జీవితముతో మాత్రమే కాకుండా వారి దయనందన సాధక బాధలలో కూడా పాలుపంచుకోవలసిన బాధ్యత గురువులకు ఉందని గట్టిగా ఉపోద్ఘాటించారు.

 ఈ వడకం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది ఎందుకు అన్న ఇప్పటివరకు ఎప్పుడు కూడా కనీవినీ ఎరగనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడమే అదే రక్తదాన శిబిరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ గురువులుగా ప్రతిరోజు సమర్పించటటువంటి దివ్య పూజబలిలో ఇది నా రక్తము దీనిని త్రాగండి అని గురువు నడిపూసలో నడి పూజలో అభిషేక పదాలుగా పలుకుతారు ఈ మాటలు కేవలం బలి యాగములో మాత్రమే కాదు మన నిజ జీవితములో కూడా సార్ధకత వహించాలి. వాటికి ఆ పదాలకు పరిపూర్ణమైన అర్థం ఎప్పుడు వస్తుంది అంటే మన రక్తాన్ని సహితము అవసరతలో ఉండేటువంటి వారికి ఇచ్చి ఇది నా రక్తము మన సొంత రక్తాన్ని సహితము ఈ విధంగా దారాదత్తము చేసినప్పుడే అని ఏసు ప్రభువు చిందించినటువంటి రక్తముతో గురువు రక్తాన్ని అనుసంధానము చేసి బోధించిన వేదాంత భరితమైన వివరణ గురువులను మంత్రముగ్ధులను చేసింది అనుటలో అతిశయోక్తి లేదు.

 ఒక వైపున ఆడోరేషన్ మరోవైపున బ్లడ్ డొనేషన్ ఒకవైపున ప్రభువు నుండి జీవితాన్ని పొందుకోవడం. మరోవైపున అదే జీవితాన్ని ఇతరులకు మనము త్యాగము చేయడం అన్నటువంటి ఆ పోలిక గురువులను ఎంతగానో ఆలోచించేలా చేసింది ఇదే కాదు గురు శ్రీ జర్నీ గారు తన వ్యక్తిగతమైన జీవితములో చేసినటువంటి కొన్ని కష్టసాధ్యమైన నిర్ణయాలు జీవన విధానం ఉదాహరణకు గురుత్వ తరిఫీదులోనే తను చెప్పులు లేకుండా నడవడం నడవాలి అన్నటువంటి నిర్ణయము దాని వెనకాల ఉండేటువంటి సంఘటనలు గురువులను గురువులకు ఏ విధంగా గురుత్వ జీవితాన్ని ఒక సవాలుగా తీసుకోవాలో ప్రేరణగా నిలిచింది. గురు శ్రీ జెర్రీ గారు ఇప్పటివరకు 2001 మార్లు రక్తదానాన్ని చేశారు అంటేనే మనకు అర్థమవుతుంది. ఆయన యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో అని ఇండియాలోనే అందరికంటే కూడా ఎక్కువ మార్లు రక్తదానాన్ని చేసినటువంటి వారిగా పేరుందారు.

 చివరి రోజు గురువులు అందరూ కూడా ప్రతిజ్ఞ పూర్వకంగా వారు చేసినటువంటి నిర్ణయాలను బలి పూజలో సమర్పించి నూతనమైన ఉత్తేజముతో తిరిగి వారి వారి విచారణలకు వెళ్లిపోవడం ఆనందదాయకమైనది అని గురుశ్రీ దేవదాస్ గారు తెలిపారు.

Add new comment

2 + 1 =