ఘనంగా అమృతవాణి సర్వసభ్య సమావేశం - 2022

అమృతవాణిసర్వసభ్య సమావేశం - 2022

తెలుగు పీఠాధిపతుల మండలి, ప్రాంతీయ సమాచార కేంద్రమైన  అమృతవాణి సంస్ధ, వార్షిక సర్వ సభ్య సమావేశం  గురువారం  సికింద్రాబాద్, అమృతవాణి  లో  జరిగాయి. వరంగల్ పీఠాథిపతులు, అమృతవాణి  అధ్యక్షులు మహా ఘన ఉడుమల బాల గారి  అధ్యక్షతన, డైరెక్టర్  గురుశ్రీ పప్పుల సుధాకర్ ఆధ్వర్యంలో 4 గురు  పాలక వర్గ సభ్యులు మరియు  40 మంది సభ్యులు మరియు గురువులు  పాల్గొన్నారు. ప్రాంతీయ సమాచార కేంద్రమైన అమృతవాణి  నుండి తెలుగు శ్రీసభ అభ్యున్నతికై  చేపట్టవలసిన  సువార్త కార్యక్రమాలు గూర్చి చర్చించారు.ప్రతి సంవత్సరం అమృతవాణి  వార్షిక సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి.
సమావేశానికి టీసీబీసీ సెక్రటరీ  గురుశ్రీ రాజు అలెక్స్ గారు, CRI ప్రొవిన్సియల్ గురుశ్రీ స్టానిస్లాస్ కొప్పాల గారు, ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమృతవాణి పాలక వర్గంలో నూతన సభ్యులుగా గురుశ్రీ రాజు అలెక్స్ ను  మరియు గురుశ్రీ స్టానిస్లాస్ కొప్పాల గారిని నియమిస్తున్నట్లు అధ్యక్షులు మహా పూజ్య ఉడుమల బాల గారు ప్రకటించారు.

ఈ సమావేశంలో అమృతవాణి భవిష్యత్కార్యాచరణ లో హాగంగా అనేక అంశాలను సభ్యులు గూర్చి చర్చించి తమ అభిప్రాయాలను వెల్లడించారు.

 అమృతవాణి భవిష్యత్కార్యాచరణ లో అంశాలైన షార్ట్ ఫిలిం పోటీలు, అమృతవాణి OTT లకు మంచి స్పందన లభించింది. సమావేశానికి విచ్చేసిన సభ్యులందరికి డైరెక్టర్ పప్పుల సుధాకర్ గారు పేరుపేరునా కృతఙ్ఞతలు తెలిపారు.

Add new comment

5 + 0 =