ఘనంగా అద్భుత శక్తిగల దివ్య బాలయేసు మహోత్సవం

విశాఖ అతిమేత్రాసనం బొబ్బిలి విచారణ లోగల బాలయేసునగర్ (గొల్లవీధి) లో అద్భుత శక్తిగల దివ్య బాలయేసు మహోత్సవం ఘనంగా జరిగింది.

బొబ్బిలి విచారణ కర్తలు  గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా దివ్య బాలయేసు మహోత్సవం  జరిగింది.
బొబ్బిలి విచారణ విశ్వాసులు, ప్రజలు మరియు చూట్టుపక్కల గ్రామాలనుండి అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 మరియమాత సహాయం కొరకు సాయంత్రం 4 గంటలకు పునీత జోజప్ప గారి దేవాలయంలో పరిశుద్ద జపమాల ను నిర్వహించారు .  బాలయేసు పుణ్యక్షత్రం నుండి  "బాలయేసు" తేరుతో పుర ప్రదక్షిణ జరిగింది.అధిక సంఖ్యలో  బాలయేసు భక్తులు, విశ్వాసులు ఈ ప్రదక్షణలో పాల్గొని ప్రభు యేసుని ప్రేమను, కృపను  ప్రజలకు చాటిచెప్పారు . 

సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి బోర్డింగ్ లో చదివి అభిషేకం పొందిన గురువులు మరియు ఇతర గురువులచే సమిష్టి దివ్య పూజబలి  ఘనం గా జరిగింది.ఈ దివ్య పూజాబలిలో  విశాఖ అతి మేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, సాత్వికులు గురుశ్రీ డొమినిక్ సావియో గారు పాల్గొని  బొబ్బిలి ప్రజల కొరకు ప్రార్ధించారు.
విచారణ సహాయక గురువులు గురుశ్రీ యోహాన్ గారు, గురుశ్రీ స్లేవ గారు, గురుశ్రీ డేవిడ్ గారు , గురుశ్రీ మరియదాసు గారు మరియు ఇతర గురువులు పాల్గొన్నారు.

గురుశ్రీ మోహన్ ప్రసాద్ గారు పండుగకు  సహాయ పడిన ప్రతి ఒక్కరికి ముఖ్యం గా విచారణ పెద్దలకు, సిస్టర్స్ మరియు యువతీ యువకులకు ప్రతి ఒక్కరికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

 

Add new comment

1 + 15 =