గ్రీన్‌ సిగ్నల్

 ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన మందుకు ప్రభుత్వం నుండి  గ్రీన్‌ సిగ్నల్ వచ్చింది . కంట్లో వేసే డ్రాప్స్‌ మినహా మిగిలిన అన్ని రకాల మందులకు అనుమతి ఇచ్చింది. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌ మందులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ప్రభుత్వం , ‘కే’ అనే మందును కమిటీ ముందు చూపించలేదనే కారణంతో నిరాకరించింది. ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా ఆయుర్వేద మందులో ఎలాంటి హానికారక పదార్థాలు లేవని ల్యాబ్లో తేలడంతో సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనడానికి ఎలాంటి నిర్ధారణలు లేవని నివేదికల్లో పేర్కొన్నారు.

నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పచ్చ కర్పూరం, పెద్ద పల్లేరు కాయ, నేల ఉసిరి, పిప్పిళ్ల చెక్క, పుప్పింట ఆకు, గుంట గరగర తేనె, పసుపు, జాజికాయ,మారేడు, నేరేడు, వేప ఇగురు, దేవర ఒంగి తదితర పదార్థాలు ఉన్నాయని. ఇవి హానికారక పదార్థాలు లేవని అధికారులు పేర్కొన్నారు.

Add new comment

6 + 5 =