గులాబ్‌ తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. మొదట గులాబ్‌ తుపాను ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గోపాల్‌పూర్‌-కళింగపట్నం మధ్య గులాబ్ తుపాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందన్నారు. ఇవాళ్టి నుంచి మరో రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఈపాటికే ఉత్తర ఆంధ్రప్రదేశ్, అటు దక్షిణ ఒడిశా జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్‌లు జారీ చేశారు.

Add new comment

16 + 3 =