Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
గుణదలమాత నొవీన ప్రార్ధనలు ప్రారంభం
Wednesday, February 01, 2023
విజయవాడ మేత్రాసనంలోని గుణదలమాత పుణ్యక్షేత్రం లో గుణదలమాత నొవీన ప్రార్ధనలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 9 , 10 , 11 తారీకులలో గుణదలమాత మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనవరి 31 న గుణదలమాత పుణ్యక్షేత్రంలో నొవీన ప్రార్ధనలు ప్రారంభమయ్యాయి.
విజయవాడ పీఠాధిపతి మహా పూజ్య తెలగతోటి రాజారావు గారు జనవరి 31 సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గుణదలమాత పతాకాన్ని ఆవిష్కరించి నొవీన ప్రార్ధనలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన దివ్యబలిపూజలో రాజారావు గారితో కలిసి పలువురు గురువులు పాల్గొన్నారు. విశ్వాసులందరు కలిసి క్రొవ్వొత్తులతో ప్రదక్షిణగా గుణదల కొండ పైకి వెళుతూ జపమాలను జపించారు.
Add new comment