గుంటూరు మేత్రాసనంలో మరియతల్లి ,యేసు క్రీస్తు స్వరూపాలు ధ్వంసం

గుంటూరు మేత్రాసనంలో మరియతల్లి ,యేసు క్రీస్తు స్వరూపాలు  ధ్వంసం

 

జాతీయ రహదారిలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగల *పాస్టరల్ సెంటర్ (నాగార్జుననగర్) నందు గల ప్రేయర్ టవర్ లో ఉన్న యేసు క్రీస్తు,మరియమాత,బాలయేసు స్వరూపాలను ద్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. దుండగుల దుశ్చర్య పై గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు చిన్నబత్తిని భాగ్యయ్య గారు,  క్రైస్తవ మత పెద్దలు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ధ్వంసమైన యేసు క్రీస్తు, మరియతల్లి స్వరూపాలను భాగ్యయ్య గారు పరిశీలించి విధ్వంసం జరిగిన ప్రాంతంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శాంతి కోసం పనిచేస్తున్న క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యవహరించడం దారుణమని పీఠాధిపతులు తెలియజేసారు. గుంటూరు మేత్రాసనంలో ఇప్పటికే ఈ తరహా ఘటనలు మూడు జరిగాయని వాటిలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని ఆయన అన్నారు.  

 
 

Add new comment

5 + 6 =