గుంటూరు పీఠంలో యేసు తిరు హృదయ మహోత్సవాలు.

గుంటూరు మేత్రాసనం, పెద్దపలకలూరు విచారణ యందు 24 జూన్ 2022 న యేసు తిరు హృదయ మహోత్సవము ఘనంగా జరిగాయి.

గుంటూరు పీఠాధిపతి మహా పూజ్య చిన్నాబత్తిని భాగ్యయ్య తండ్రిగారు,  మేత్రాసన గురువులతో  కలిసి సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు. 

మేత్రాణులవారు దైవవాక్కును బోధిస్తూ "యేసు ప్రభు కారుణ్య హృదయాన్ని మనమందరము కలిగి ఉండాలి" అని అన్నారు.

ఈ దివ్యబలి పూజలో 15 మంది గురువులు, మఠకన్యలు సుమారు 500 మందికి పైగా విశ్వాసులు పాల్గొన్నారు. వీరు పెద్దపలకలూరు,  కోకవారిపాలెం మరియు బండారుపల్లి గ్రామాలకు చెందినవారు.

విచారణ కర్తలు గురుశ్రీ తుమ్మా వేలంగాణి శౌరెడ్డి గారు విచ్చేసిన పీఠాధిపతులవారిని, గురువులకు, విచారణ సంఘపెద్దలకు, గాయక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

గుంటూరు మేత్రాసనాన్ని, పీఠాధిపతులను, గురువులను, ఉపదేశులను మరియు విశ్వాసులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు దేవుని ప్రార్థిస్తున్నారు.

Add new comment

9 + 5 =