గుంటూరులో జాతీయ నిరసన దినం 

జాతీయ నిరసన దినంగుంటూరు

1950 ఆగష్టు 10 న అప్పటి భారత అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ గారు విడుదల చేసిన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హిందూ మతానికి చెందని వారు షడ్యూలు కులాలుగా పరిగణింపబడరని నిర్ధారించారు.

దీనికి వ్యతిరేకంగా దళిత క్రైస్తవులు 72 సంవత్సరాలుగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. ప్రతి ఏటా ఆగష్టు 10 ని నిరసన దినం (Black day ) గా ప్రకటించి, ఆ రోజున క్రైస్తవులందరూ తమ నిరసనను తెలియజేస్తున్నారు.

ఈ సంవత్సరం నిరసన దినాన్ని పురస్కరించుకొని గుంటూరు పీఠం వారు తమ నిరసనను తెలియజేసారు.

క్రైస్తవులు భారీ ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని బ్యానర్లు పట్టుకొని గుంటూరు ప్రధాన రహదారులలో ప్రదక్షిణగా వెళుతూ తమ నిరసనను తెలియజేసారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించారు.

భారత దేశం త్వరలో దళిత క్రైస్తవులను షడ్యూలు కులాలుగా ప్రకటిస్తారని ఆశిస్తున్నాము

Add new comment

6 + 0 =