ఖమ్మం మేత్రాసనంలో పునీత ఇజ్ఞాసు లొయోల వారి వార్షికోత్సవ వేడుకలు

లొయోల ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ (LITDS):
 LITDS ఆంధ్రప్రదేశ్‌లోని, పునీత ఇజ్ఞాసు లొయోల వారు స్థాపించిన జేసుసభ(జెస్యూట్‌) గురువుల గిరిజన సంక్షేమ మరియు అభివృద్ధి సంఘంలో ఒకటి. ఇది పేదరికం, ఆకలి మరియు వ్యాధుల బారిన ఉన్న గిరిజన జనాభాకు సేవలు అందిస్తుంది. ఇతర మత సిబ్బంది, లే సిబ్బంది, యానిమేటర్లు, గ్రామాలు మరియు పల్లెల్లో ఉపాధ్యాయుల సహకారంతో జేసుసభ(జెస్యూట్‌) గురువుల ద్వారా వివిధ సేవల ద్వారా గిరిజన ప్రజలకు సమగ్రాభివృద్ధి ఫలాలను అందించడం LITDS యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ ప్రాంతంలోని గిరిజనులకు కనీస ప్రాథమిక అవసరాలు కూడ లేవు. అందువల్ల జెస్యూట్‌ గురువులు ఇతరులతో నెట్‌వర్కింగ్‌లో ప్రోగ్రామ్‌లను అమలు చేయడానికి ఫీల్డ్ వర్కింగ్ ఏరియాగా కాటుకపైలి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కాటుకపైలి, ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ ప్రాంతంలో కోయ, కుడు కోయ మరియు కొండ రెడ్డి గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్నారు.

కాటుకపైలి గిరిజన మిషన్ చరిత్ర మరియు స్థాపన :
భద్రాచలం అడవుల్లో గిరిజన మిషన్ ఉండాలని ఆంధ్రప్రదేశ్‌లోని జేసుసభ(జెస్యూట్‌) గురువుల చిరకాల వాంఛ  అది 1993లో సాకారమైంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లా, చింతూరు మండలం ఏడుగురాలపల్లిలో ప్రారంభమైంది. పునీత ఇజ్ఞాసు లొయోల వారి స్మరణకు గురుతుగా  గురు శ్రీ బాలయ్య గారి చిరకాల వాంఛ గిరిజన సంఘం సమగ్రాభివృద్ధి, అది భద్రాచలం అడవిలో ఒక గిరిజన మిషన్‌ను స్థాపించడం . ఆ సమయంలో ఖమ్మం మేత్రానులు  మహా పూజ్య M. జోజి గారు ఈ మిషన్‌ను ఆశీర్వదించారు. గురుశ్రీ ఎ.ఎక్స్.జె. బోస్కోగారు ప్రావిన్షియల్‌గా అద్దె ఇంటిలో ఉంటూ గిరిజన మిషన్‌ను ప్రారంభించారు. 1994లో కాటుకపైలిలోని ప్రజలు 9 ఎకరాల భూమిని ఇచ్చి అక్కడ కార్యకలాపాలు ప్రారంభించేందుకు బృందాన్ని ఆహ్వానించారు.

ఆ విధంగా లయోలా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ సొసైటీ (LITDS) జూన్ 1994లో కాటుకపల్లికి మార్చబడింది. సెయింట్ ఆన్ ఆఫ్ లూజెర్న్ మఠకన్యలు  ఆగస్టు 1994లో వైద్య కార్యక్రమాన్ని చేపట్టేందుకు LITDSలో చేరారు.  మఠకన్యలు గ్రామాల చుట్టూ తిరుగుతూ 55 గ్రామాల పరిధిలో ఉన్న వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేశారు. తొలిదశలో గిరిజనులు వారి నుంచి పారిపోయినా, మఠకన్యల ప్రేమ, కరుణ మెల్లమెల్లగా గిరిజనుల హృదయాలను గెలుచుకున్నాయి. ప్రతిసంవత్సరం పునీత ఇజ్ఞాసు లొయోల వారి జ్ఞాపకార్థం ఈ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీలో ఆయన పండుగను ఎంతో ఘనంగా కొనియాడుతారు.

పునీత ఇజ్ఞాసు లొయోల వారి 500ల సంవత్సరాల పునీతుల వార్షికోత్సవం సందర్బంగా జులై 31 ఆదివారం రోజున కాటుకపైలిలోని లొయోల ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ  నందు ఉదయం 10 గంllలకు LITDS అసిస్టెంట్ డైరెక్టర్ గురుశ్రీ ప్రశాంత్ గారు పునీత ఇజ్ఞాసు లొయోల గారి గొప్పతనాన్ని విశ్వాసులకు వివరించి దివ్యబలిపూజను సమర్పించారు. దివ్యబలిపూజకు దాదాపుగా 500 మంది విశ్వాసులు హాజరయ్యారు. పూజకు విచ్చేసిన గురువులకు,మఠకన్యలకు, విశ్వాసులకు గురుశ్రీ అగస్టీన్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.

లొయోల ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీని ఆ దేవాదిదేవుడు ఎల్లపుడు దీవించాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు.

Add new comment

4 + 2 =