క్రైస్తువుల సహాయమాత మహోత్సవ0 | నవదిన ప్రార్థనలు

విశాఖ అతిమేత్రాసనం గోదావరి విచారణ దివ్యరక్షకుని దేవాలయము, రాజమహేంద్రవరం లో క్రైస్తువుల సహాయమాత  మహోత్సవ నవదిన ప్రార్థనలు  ఘనంగా  మొదలయ్యాయి.  మే 22  నుండి  30  తారీకు  వరకు సాయంత్రం 5.30  గంటలకు  ఈ   నవదిన ప్రార్థనలు ప్రారంభమవుతాయి. మొదటిరోజు విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్  గురుశ్రీ దుగ్గంపూడి బాలశౌరి గారు ఆవిష్కరించారు. అనంతరం ఇతర గురువులతో కలసి దివ్య పూజబలి ని సమర్పించారు.  ఈ సందర్భముగా  మరియ తల్లి యొక్క దీనత్వం గురించి ప్రజలకు బోధించారు.

విచారణ ప్రజలు ,విశ్వాసులు భక్తి శ్రద్ధలతో ఈ నవదిన ప్రార్థనలలో పాల్గొన్నారు. విచారణ పెద్దలు , FCC సిస్టర్స్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా  చూసుకుంటున్నారు.

 గోదావరి విచారణ కర్తలు, విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు  గురుశ్రీ  మనోజ్ కుమార్ గారు మాట్లాడుతూ  ప్రజలందరూ ఈ నవదిన ప్రార్థనలలో పాల్గొనిఆ దేవాది దేవుని  దీవెనలు పొందాలని కోరారు.
ఎల్లప్పుడు ప్రజలను ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధి లోనికి నడిపిస్తున్న   విచారణ ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ మనోజ్ కుమార్ గారికి దేవాది దేవుని దీవెనలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ అమృతవాణి  రేడియో వెరిటాస్ ఆసియ  తెలుగు విభాగం.

 

Add new comment

4 + 7 =