క్రైస్తువుల సహాయమాత మహోత్సవము ఘనంగా జరిగింది

విశాఖ అతిమేత్రాసనం గోదావరి విచారణ దివ్యరక్షకుని దేవాలయము, రాజమహేంద్రవరం లో  క్రైస్తువుల సహాయమాత మహోత్సవము ఘనంగా  జరిగింది. మే 22  తారీకు  నుండి   నవదిన ప్రార్థనలు మొదలయ్యాయి.  విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు,గోదావరి విచారణ కర్తలు   గురుశ్రీ  మనోజ్ కుమార్ గారి  ఆద్వర్యం లో  క్రైస్తువుల సహాయమాత పండుగా కన్నుల పండుగగా జరిగింది.  పండుగ రోజు విశాఖ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారు ముఖ్య అథితిగా పాల్గొని దివ్యబలిపూజను సమర్పించారు.  
విచారణ ప్రజలు ,విశ్వాసులు భక్తి శ్రద్ధలతో పండుగలో  పాల్గొన్నారు. ప్రత్యేకం గా రూపొందించిన "క్రైస్తువుల సహాయమాత" తేరుని పురవీధుల గుండా  ప్రదక్షిణగా దేవాలయానికి తీసుకువచ్చారు.  
 విచారణ పెద్దలు,FCC సిస్టర్స్ మరియు దేవాలయ యువత సహాయ సహకారాలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా  ఆద్యంతం చూసుకున్నారు. ఈ పండుగ సందర్భముగా  విచారణ పిల్లలు నూతనంగా దివ్య సత్ప్రసాదమును స్వీకరించారు.
 విచారణ గురువులు  గురుశ్రీ  మనోజ్ కుమార్ గారు పండుగకు  సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. 

Add new comment

4 + 15 =