Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
క్రైస్తవ సమాధుల తోట ఏర్పాటుకు స్థల పరిశీలన
క్రైస్తవ సమాధుల తోట ఏర్పాటుకు స్థల పరిశీలన
గుంటూరులో క్రైస్తవుల సమాధుల తోట ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మద్దు బాలస్వామి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ "క్రైస్తవుల మరణాంతరం సమాధి చేయడమనేది రెండు వందల యాభై సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుందని" తెలిపారు.
గుంటూరు నగరంలోని సమాధుల తోటలోని స్థలం 15 సంవత్సరాల కిందటే నిండిపోవడంతో గత్యంతరం లేక ఒకే సమాధిలో నాలుగు మృతదేహాల్ని ఖననం చేసే దుస్థితి ఏర్పడిందని తెలిపారు.
ఈ సమస్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లగా , సమస్య తెలుసుకున్న శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి క్రైస్తవుల సమాధుల తోట ఏర్పాటుకు అంగీకరించడంతో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో స్థల పరిశీలన చేసినట్లు బాలస్వామి గారు తెలిపారు.
ఈ మేరకు నగరంలోని పొత్తూరు జగనన్న కాలనీ దగ్గరలో ఉన్న 16.53 ఎకరాల కొండ పోరంబోకు భూమిని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఆయన సోమవారం నగరపాలక సంస్థ పరిధిలోని పొత్తూరులో ఉన్న సర్వే నంబర్ 529, 530, 531లోని 16.53 ఎకరాల కొండ పోరంబోకు భూమిని రాష్ట్ర సమా చార శాఖ కమిషనర్ శామ్యూల్ జోనాథన్, వివిధ క్రైస్తవ సంఘాల నాయకులు ప్రతినిధులతో కలసి పరిశీలించారు.
త్వరలోనే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, క్రైస్తవుల సమాధుల తోట సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, నగరపాలక సంస్థ అధికారులతో కలసి యుద్ధప్రాతిపదికన ప్రత్యేక చర్యలు తీసుకుం టామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో నగ రంలోని వివిధ సంఘాల పాస్టర్లు, క్రైస్తవ ప్రజా ప్రతి నిధులు, నాయకులు పాల్గొన్నారు.
Add new comment