Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
క్రైస్తవుల సహాయమాత మహోత్సవము
విశాఖ అతిమేత్రాసనం గోదావరి విచారణ దివ్యరక్షకుని దేవాలయములో క్రైస్తవుల సహాయమాత మహోత్సవము ఘనంగా జరిగింది.
22 మే 2023 తేదీన పతాక పండుగ ఆవిష్కరణ జరిగింది. మే 22 నుండి 30 తేదీ వరకు సా॥ గం॥ 5-30 ని॥లకు నవదిన ప్రార్ధనలు, దివ్య బాలి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
పండగ రోజు అనగా బుధవారం మ|| 3 గం||లకు దివ్యకారుణ్య జపమాల, ప్రత్యేక వాక్యపరిచర్య, సా|| గం|| 5-30 ని||లకు సహాయమాత తేరు తో పురప్రదక్షణ, అనంతరం సమిష్టి దివ్య బలిపూజ ను నిర్వహించారు.
విశాఖ అగ్రపీఠ చాన్సలర్ గురుశ్రీ శ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ గారు ముఖ్య అతిధులుగా పాల్గొని ఇతర గురువులతో కలసి సమిష్టి దివ్యపూజాబలిని సమర్పించారు.
విశాఖ మేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ మనోజ్ కుమార్ గారి ఆద్వర్యం లో ఈ పండుగా ఘనంగా జరిగింది. విశ్వాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.విచారణ గాయక బృందం పవిత్ర గీతాలను ఆలపించారు.
పండగకు వచ్చిన గురువులను, చదువులలో ప్రతిభ చూపించిన విద్యార్థులను విచారణ గురువులు సత్కరించారు.
ఈ మహోత్సవ పూజ అయిన తదనంతరం సాంస్కృతిక కార్యక్రమములు, ప్రేమ విందు ఏర్పాటు చేయడమైనది.
Add new comment