క్రీస్తు కోసం తమను తాము అంకితం చేసుకొనే కథోలికులు కావాలి 

శ్రీలంక కార్డినల్ మాల్కం రంజిత్

శ్రీలంక రాజధాని అయిన కొలంబోకు చెందిన కార్డినల్ మాల్కం రంజిత్ గారు కథోలికులు "దేవాలయానికి అంకితమైన కథోలికులు"  కాకుండా  "వీధుల్లోకి వచ్చి న్యాయం కోసం పోరాడాలని, మరియు సమాజానికి సరైనది చేయాలని" కోరారు.

కొలంబోలో జరిగిన దేవ ధర్మ నికేతనయ 40వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేసారు.

"ఒకప్పుడు కథోలిక చర్చి పీఠాధిపతుల మరియు గురువుల కేంద్రీకృత చర్చిగా పనిచేసింది మరియు పీఠాధిపతులు  మరియు గురువులు చెప్పేది మాత్రమే చేసింది" అని కార్డినల్ చెప్పారు.

“ఈరోజు మనకు అలాంటి పవిత్రమైన కథోలికులు అవసరం లేదు. క్రీస్తు కోసం తమను తాము అంకితం చేసుకొని ఆయన మాదిరిని అనుసరించే క్రైస్తవులు చర్చికి అవసరం. 

"పోప్ ఫ్రాన్సిస్ చర్చిలో సైద్ధాంతిక సిద్ధాంతంగా మారిన గురువు కేంద్రీకృత స్థానాన్ని మార్చాలని మరియు ప్రస్తుత ప్రపంచానికి సరిపోయే విధంగా చర్చి ఎలా మారాలో అధ్యయనం చేయాలని కోరుకుంటున్నారు" అని ఆయన అన్నారు.

"చర్చి తన దృక్పథాన్ని మార్చుకోవాలి మరియు ఈ పవిత్రమైన కథోలికులు ఇకపై అవసరం లేదు" అని కార్డినల్ రంజిత్ అన్నారు.

పీఠాధిపతులు మరియు గురువులు లౌకికులకు మరిన్ని బాధ్యతలు అప్పగించాలని, సంతోషంతో ఆ పని చేయాలని కూడా ఆయన జోడించారు.

శ్రీలంకలోని అపోస్టోలిక్  నున్షియో బిషప్ బ్రియాన్ ఉడైగ్వే, క్యాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు బిషప్ హెరాల్డ్ ఆంథోనీ పెరెరా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సందేశాలను ఇచ్చారు.

Add new comment

1 + 0 =